Solar Eclipse 2023: 2023లో తొలి సూర్య గ్రహణం ఇవాళ అంటే ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. ఇవాళ వైశాఖ అమావాస్య. జ్యోతిష్యశాస్త్రంలో సూర్య గ్రహణానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సూర్య గ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం..
సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడి వెలుగు భూమిపై ప్రసరించకుండా కాస్సేపు చంద్రుడు అడ్డుకుంటాడు. జ్యోతిష్యంలో సూర్య గ్రహణం సూతక కాలం 12 గంటలుంటుంది. సూర్యుడు మేష రాశిలో ఉండటం వల్ల ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం నేపధ్యంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. గ్రహణం పూర్తయ్యాక కొన్ని పనులు తప్పకుండా చేయాలి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కోసం గ్రహణం పూర్తయిన వెంటనే రాశి ప్రకారం కొన్ని వస్తువుల్ని దానం చేయాలి.
మకర రాశి జాతకులు గ్రహణం తొలగిన వెంటనే గొడుగు, నలుపు లేదా నీలం బట్టలు, ఆవాల నూనె, నువ్వులు వంటివి దానం చేయడం అనివార్యమంటున్నారు.
మీనరాశి జాతకులు గ్రహణం తరువాత బెల్లం, శెనగపప్పు, పసుపు వస్త్రాలు దానం చేయాలి.
ధనస్సు రాశి జాతకులు గ్రహణం వదిలిన తరువాత పసుపు రంగు వస్తువులు, శెనగపప్పు, శెనగపిండి, బెల్లం, పసుపు, కేసరి దానం చేయాలి.
కుంభ రాశి జాతకులు సూర్య గ్రహణం అయిపోయిన వెంటనే గొడుగు, నలుపు లేదా నీల బట్టలు, ఆవాల నూనె దానం చేయడం మంచి పద్ధతి
సింహ రాశి జాతకులు గ్రహణం తరువాత ఎవరైనా బ్రాహ్మణుడికి గోధుమలు, రాగి పళ్లెం, ఎరుపు లేదా ఆరెంజ్ వస్తువులు దానం చేయాల్సి ఉంటుంది.
కన్యా రాశి జాతకులు గ్రహణం పూర్తయ్యాక ఆకుపచ్చని మేత, పచ్చ పెసలు, పచ్చని బట్టలు, పచ్చని కూరగాయలు దానం చేయాలి.
వృశ్చిక రాశి జాతకులు సూర్య గ్రహణం తరువాత కొన్ని నిర్దేశిత వస్తువులు దానం చేయాలి.
మిధున రాశి జాతకులు గ్రహణం ముగిసిన వెంటనే ఆవులకు గ్రాసం తిన్పించాలి. ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చని బట్టలు, పచ్చ పెసలు దానం చేయడం మంచిది.
కర్కాటక రాశి జాతకులు గ్రహణం వదిలిన వెంటనే బ్రాహ్మణులకు ముత్యాలు, తెల్లటి బట్టలు, పంచదార, బియ్యం, పాలు లేదా పాల ఉత్పత్తులు దానం చేయాలి
వృషభ రాశి జాతకులు సూర్య గ్రహణం సమయం సమాప్తమయ్యాక పాలు, పెరుగు, పాయసం, పంచదార, బియ్యం, తెల్ల బట్టలు దానం చేయాలి
మేష రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం తరువాత ధాన్యం, బెల్లం, ఎర్రని బట్టలు, మసూర్ దాల్ దానం చేయాలి.
Also read: Hanshraj Yog 2023: 84 ఏళ్ల తర్వాత హన్స్ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook