Kamika Ekadashi vrat Katha 2022: శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి నాడు కామికా ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ సంవత్సరం కామిక ఏకాదశి వ్రతం జూలై 24 ఆదివారం నాడు జరుపుకుంటున్నారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి.. ఈ వ్రత కథను వింటే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుందట. అంతేకాకుండా ఈ వ్రతం రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఒకసారి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని కామిక ఏకాదశి వ్రత (Kamika Ekadashi vrat Katha 2022) ప్రాముఖ్యత గురించి అడిగాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు అతనికి కామికా ఏకాదశి వ్రత పూజా విధానం మరియు దాని కథ చెప్పాడు.
కామిక ఏకాదశి వ్రత కథ
శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో ఒకసారి నారద ముని కామిక ఏకాదశి వ్రతం యొక్క మహిమ, పద్ధతి మరియు కథను చెప్పిమని తన తండ్రైన బ్రహ్మదేవుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మ ఈ వ్రత ప్రాముఖ్యత గురించి సవివరంగా చెప్పాడు.
ఒక గ్రామంలో ఠాకూర్ అనే వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు అతడు బ్రహ్మణుడితో గొడవ పడి.. కోపంలో అతనిని చంపేశాడు. ఈ పాపం నుండి బయటపడటానికి ఆ బ్రహ్మణుడి అంత్యక్రియలు చేయాలనుకున్నాడు. అందుకు బ్రహ్మణులు ఠాకూర్ కు అనుమతి ఇవ్వలేదు. అంతేకాకుండా బ్రాహ్మణుడిని చంపినందుకు నిందించారు. ఒకరోజు ఆ ఠాకూర్ బ్రహ్మ హత్య నుండి బయటపడటానికి మార్గం చెప్పమని ఒక ఋషిని అడిగాడు. కామికా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తేనే బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి లభిస్తుందని ఆ మహర్షి చెప్పాడు. ఠాకూర్ కామికా ఏకాదశి వ్రతం చేసి...నియమ నిష్ఠలోత విష్ణువును పూజించాడు. రాత్రి విష్ణువు విగ్రహం దగ్గరే నిద్రించాడు. శ్రీ హరి కలలో కనిపించి బ్రహ్మను చంపిన పాపం నుండి నువ్వు విముక్తి పొందినట్లు చెప్పాడు.
కామిక ఏకాదశి రోజు రాత్రి విష్ణు దేవాలయంలో దీపం వెలిగించిన వారికి, వారి పూర్వీకులకు స్వర్గంలో అమృతం సేవించే అవకాశం లభిస్తుంది. దీపం వెలిగించిన వారికి మరణానంతరం సూర్యలోకంలో స్థానం లభిస్తుంది. కామిక ఏకాదశి ఉపవాస కథను విన్న వ్యక్తి పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకంలో స్థానం పొందుతాడు.
Also Read: Kamika Ekadashi 2022: కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వ్రతంలో పసుపు రంగుకు ఎందుకు అంత ప్రాధాన్యత?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook