Karthika Pournami 2022 Date And Time: కార్తీక మాసం హిందూ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవ చంద్ర మాసంలో వచ్చే ప్రీతికరమైన రోజులు. ఈ క్రమంలో 7 రోజుల పాటు నదులను పూజిస్తారు. నది స్నానాలు చేసి పవిత్ర నదులను పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని కార్తీక పూర్ణిమ అంటారు. అయితే భారత దేశ వ్యాప్తంగా ఈ రోజులను పవిత్ర రోజులుగా భావిస్తారు. అంతేకాకుండా కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ వారం రోజుల పాటు చంద్ర మాసం కొనసాగుతుంది. ఈ క్రమంలో దేవతామూర్తులను పూజించడం హిందువుల ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ కార్తీక మాస సమయాల్లో ఇలా పూజ కార్యాక్రమాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కార్తీక పూర్ణిమ తేదీ, శుభ సమయం:
>>ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ 07 నవంబర్ 2022 సాయంత్రం 04:15 గంటలకు ప్రారంభమవుతుంది.
>>కార్తీక పూర్ణిమ తిథి ముగింపు సమయం: సాయంత్రం 04:00 (08 నవంబర్ 2022 )
>>కార్తీక పూర్ణిమ ఉపవాసాల సమయలు(ఉదయం తిథి 8 నవంబర్ 2022)
>>కార్తీక పూర్ణిమ బ్రహ్మ ముహూర్తం: తెల్లవారుజామున 04.57 నిమిషాల నుంచి ఉదయం 05.49 గంటల వరకు.
కార్తీక పూర్ణిమ ప్రాముఖ్యత:
కార్తీక పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేసి.. దీపదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పుణ్యఫలం లభిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా మంది భక్తులు ఈ రోజునా ఉపవాసాలు చేస్తారు. ఇలా పాటించి భక్తితో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ రోజున చేసే దానాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కృత్తిక నక్షత్రంలో చంద్రుడు, బృహస్పతి ఉంటే.. మహాపుర్ణిమగా భావిస్తారు శాస్త్ర నిపుణులు. ఈ రోజు సాయంత్రం త్రిపురోత్సవం నిర్వహించి దీపదానం చేయడం వల్ల పునర్జన్మ లభిస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కార్తీక పూర్ణిమ పూజా విధానం:
>>కార్తీక పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఉపవాస వ్రతం చేయాల్సి ఉంటుంది. వీలైతే నది స్నానం చేయాలని శాస్త్ర నిపుణలు సూచిస్తున్నారు.
>>ఉపవాస క్రమంలో కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
>>కార్తీక పూర్ణిమ రోజున హరివిష్ణువుతో పాటు లక్ష్మి దేవిని పూజించాలి. ఇలా పూజించడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం లభించి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.
>>ప్రత్యేకంగా గంగ, యమునా వంటి పవిత్ర నదిలో పరివాహక ప్రాంతాల్లో దీపాన్ని వేలిగించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
>>ఇంటి గుమ్మం ముందు నెయ్యితో చేసిన దీపాలను వెలిగించాలి.
Also Read: Nara Brahmani: జయలలిత ఫామ్‌హౌస్ నారా బ్రాహ్మిణి కొనుగోలు..? సోషల్ మీడియాలో ప్రచారం.. టీడీపీ క్లారిటీ
Also Read: RGV Meets CM YS Jagan : వైఎస్ జగన్‌తో ఆర్జీవీ భేటీ.. పవన్ కళ్యాణ్ పరువుతీసేందుకే కుట్ర?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి