Ketu Gochar 2023: కొత్త ఏడాదిలో తులరాశిలో కేతు గోచారం.. ఈ మూడు రాశులకు అదృష్ట యోగం..

Ketu Gochar 2023: కొత్త ఏడాదిలో కేతు గ్రహం తులారాశిలో సంచరించబోతోంది. కేతు యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2022, 11:42 AM IST
  • కొత్త ఏడాదిలో రాశిని మార్చనున్న కేతువు
  • ఈ 3 రాశులవారికి అపారమైన ప్రయోజనం
  • ఇందులో మీరున్నారా మరి
Ketu Gochar 2023: కొత్త ఏడాదిలో తులరాశిలో కేతు గోచారం.. ఈ మూడు రాశులకు అదృష్ట యోగం..

Ketu Gochar In Tula: 2023 సంవత్సరం ప్రారంభం కావడానికి దాదాపు నెల రోజుల సమయం ఉంది. కొత్త ఏడాదిలో కొన్ని పెద్ద మరియు చిన్న గ్రహాల రాశిచక్రాలు మార్పులకు లోనవుతాయి. ఛాయా గ్రహమైన కేతువు తన రాశిని మార్చి తులరాశిలోకి (Ketu transit in tula 2023) ప్రవేశించనుంది. 2023లో కేతు సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. దీంతో మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. 

ధనుస్సు (Sagittarius): తులా రాశిలో కేతువు సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కేతు గ్రహం మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీ ఆదాయంలో రెట్టింపు లాభం ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మకరం (Capricorn): కేతువు యొక్క సంచారం ఈ రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే  కేతు గ్రహం మీ సంచార జాతకంలోని పదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీరు కొత్త జాబ్ ను పొందే అవకాసం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. 

సింహం (Leo): కేతు గ్రహం యొక్క సంచారం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కేతు గ్రహం మీ సంచార జాతకంలో మూడవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీ ధైర్యం పెరుగుతుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. 

Also Read: Guru Margi 24 November 2022: ఈ రాశువారికి గురు మార్గి వల్ల విపరీతమైన డబ్బే..డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News