Kumbh Mela 2025 Prayagraj Date: రాబోయే 2025 కొత్త సంవత్సరంలో మొదటి నెలలోనే ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళ జరగబోతోంది. జనవరి 13వ తేదీ నుంచి ఈ మహా కుంభమేళను నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ కుంభమేళను ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మతపరమైన పండగ భావిస్తారు. అందుకే ఈ సమయంలో అఘోరులతోపాటు సాధువులు, భక్త జనాలు భారీ ఎత్తున తరలి వస్తారు. ఈ మహా కుంభమేళా సమయంలో భక్తులంతా ఒక్కటే గంగమ్మ ఒడిలో ప్రత్యేకమైన స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
ఈ మహా కుంభమేళలో భాగంగా ప్రత్యేకమైన రాజ స్నానాలు కూడా ఉంటాయి. మత విశ్వాసాల ప్రకారం ఈసారి మొత్తం ఆరు రాజ స్నానాలను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు జనవరి 13నే తొలుత రాజ స్నానం ప్రారంభం కాబోతోంది. అలాగే ఈ స్నానాన్ని మౌని అమావాస్య స్నానంగా కూడా పిలుస్తారు.
మౌని అమావాస్య స్నానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. పూర్వికులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్నానాన్ని ఆచరించే వారిని తెలుస్తోంది. ముఖ్యంగా సాధువులు, ఋషులు ఈ స్నానాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి ప్రత్యేకమైన ఉపవాసాలు కూడా పాటిస్తారని సమాచారం..రాజ స్నానం అంటే మహా కుంభ వేళలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఘట్టంగా చెప్పవచ్చు. దీనిని అతిపెద్ద స్నానంగా కూడా భావిస్తారని పురాణాల్లో చెప్పుకు వచ్చారు. మౌని అమావాస్య జనవరి 29వ తేదీన వచ్చింది. అయితే ఈ అమావాస్య రోజునే అందరు మూడవ రాజ స్నానం చేస్తారు. ఇలా చేయడం తరతరాలుగా వస్తోంది.
రాజ స్నానం మౌని అమావాస్య రోజున అంటే జనవరి 29న శుభ సమయంలో చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి దానాలు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. ఇక బ్రహ్మ ముహూర్తం విషయానికొస్తే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుంది. మహా కుంభమేళ లో భాగంగా మౌని అమావాస్య రోజున రాజ స్నానం చేసి పూర్వీకులను తలుచుకుంటూ దానధర్మాలు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి జన్మజన్మల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని పురాణాల్లో కూడా తెలిపారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.