Chandra Grahan 2023: చంద్రగ్రహణం తేది, ప్రత్యేక సమయాలు, సూతక కాలం నియమాలు..

Last Chandra Grahan 2023 Date and Time: చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే సూతక కాల సమయంలో తప్పకుండా గర్భిణీ స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 10:08 AM IST
Chandra Grahan 2023: చంద్రగ్రహణం తేది, ప్రత్యేక సమయాలు, సూతక కాలం నియమాలు..

Last Chandra Grahan 2023 Date and Time: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో  అక్టోబర్ నెల చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెలలోనే చాలా రాశులు సంచారం చేయడంతో పాటు ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. కాబట్టి కొన్ని రాశులవారిపై ఈ గ్రహ సంచారాల ప్రభావంతో పాటు, గ్రహణ ప్రభావం కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహణ ప్రభావం భారత్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతుందో..సూతకాలం ఎప్పుడు ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందంటే:
ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి సంభవిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుతున్నారు. ఖగోళ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..అక్టోబర్ 29 ఉదయం 01:05 గంటలకు ప్రారంభమై.. 02:24 గంటలకు ముగుస్తుందన్నారు. 

ఈ దేశాలలో చంద్రగ్రహణం కనిపిస్తుంది:
ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కాకుంగా యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, తూర్పు, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం, అంటార్కిటికాలో కనిపిస్తుంది. అంతేకాకుండా అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి.

చంద్రగ్రహణం సూతక కాల సమయం:
చంద్రగ్రహణం సూతక కాలం 09 గంటల ముందే ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే భారత్‌లో ఈ చివరి చంద్రగ్రహణం దృశ్యమానత కారణంగా సూతక కాలం  అక్టోబర్ 28 సాయంత్రం 04:05 నుంచి చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఈ గ్రహణం ఏయే రాశులను ప్రభావం చూపుతుందంటే:
ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం మేషం, అశ్విని నక్షత్రాలలో సంభవించబోతోంది. దీని కారణంగా మేషం, వృషభం, కన్య, మకర రాశుల వారు గ్రహణ కాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రహణం కారణంగా మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ రాశుల వారు మంచి ఫలితాలు పొందుతారు. 

చంద్రగ్రహణంలో సూతక కాలం నియమాలు:

  • గర్భిణీ స్త్రీలు గ్రహణ సూతకాల సమయంలో తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 
  • గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువుల ముట్టుకోకపోవడం చాలా మంచిది.  
  • సూతకాల సమయంలో పాలు, పెరుగు, నీరు తాగకపోవడం చాలా మంచిది.
  • ఈ సమయంలో దేవుడి విగ్రహాలను పూజించడం మానుకోవాలి.
  • గ్రహణ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు జరుపుకోవద్దు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News