జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశుల్ని బట్టి జాతకం ఉంటుందని అందరికీ తెలిసిందే. అదే సమయంలో మూడు రాశులకు చెందిన అమ్మాయిలు అత్యంత శుభసూచకులుగా జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ మూడు రాశుల అమ్మాయిలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుందట. ఆ మూడు రాశులేంటో చూద్దాం..
జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి రాశి జాతకులకు ప్రత్యేకతలున్నాయి. ప్రతి వ్యక్తిలో కొన్ని ప్రత్యేకతలు, కొన్ని లోపాలుంటాయి. తమ తమ అదృష్టాల కారణంగా..సఫలీకృతమయ్యారు. కొంతమంది కష్టపడి విజయం సాధిస్తారు. కొన్ని రాశుల అమ్మాయిలు మాత్రం అత్యంత సౌభాగ్యశీలురుగా చెబుతారు. కొంతమంది అమ్మాయిలపై లక్ష్మీదేవి కటాక్షం విశేషంగా ప్రాప్తిస్తుందంటున్నారు. ఆ ముగ్గురికి అంతులేని ధన సంపదలు లభిస్తాయంటున్నారు.
మకరరాశికి చెందిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఈ అమ్మాయిలపై లక్ష్మీదేవి కటాక్షం నిరంతరం ఉంటుందని నమ్మకం. శనిదేవుడి ప్రభావం కారణంగా ఈ రాశి జాతకులు శ్రమజీవులుగా ఉంటారు. కెరీర్లో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. డబ్బులు భారీగా సంపాదిస్తారు.
ఇక తుల రాశి అమ్మాయిలపై కూడా లక్ష్మీదేవి కటాక్షం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకు జీవితంలో డబ్బు కొరత రానేరాదు. ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో ఉంటే..అక్కడ సుఖ సమృద్ధి లభిస్తుంది. ఈ అమ్మాయిలు కష్టపడటంలో వెనుకంజ వేయరు. అద్భుతంగా డబ్బులు సంపాదిస్తారు.
వృషభరాశికి చెందిన అమ్మాయిల వద్ద డబ్బు ఎక్కువగా ఉంటుంది. అయినా చాలా ఆలోచించి డబ్బులు ఖర్చు పెడతారు. ఈ జాతకపు అమ్మాయిలు డబ్బులు సంపాదించడంలోనూ, ఖర్చుపెట్టడంలోనూ తెలివిగా ఉంటారు. పూర్తిగా మనీ మైండెడ్‌గా ఉంటారు. వ్యాపారం చేసినా అద్భుతంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలు చేసినా ఉన్నత స్థానానికి వెళ్తారు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. లగ్జరీ లైఫ్ గడిపినా వృధా ఖర్చు చేయరు.
Also read: Mars Transit 2023: కొత్త ఏడాదిలో జనవరి 13 నుంచి ఆ 4 రాశులవారికి అంతా శుభమే, వద్దంటే అగని డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook