Tilkund Chaturthi 2023: మాఘమాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథిని తిల్కుండ్ చతుర్థి అంటారు. జ్ఞానానిని అధిపతి అయిన గణేశుడు ఈరోజున జన్మించాడు కాబట్టి దీనిని వినాయక జయంతి అని కూడా అంటారు. ఈ పండుగ మాఘ మాసంలో వస్తుంది కాబట్టి దీనిని మాఘ శుక్ల చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ ఫెస్టివల్ కు వరద్ చతుర్థి అనే మరో పేరు కూడా ఉంది. తిల్కుండ్ చతుర్థిని ఇవాళ అంటే జనవరి 25 బుధవారం నాడు వస్తుంది. ఈ పండుగను మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. గణపతి బప్పా అనుగ్రహం పొందేందుకు, కష్టాలు తొలగిపోవడానికి గణేష్ జయంతి రోజు ప్రత్యేకం. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి మరియు తిల్కుండ్ చతుర్థి నాడు ప్రత్యేకమైన పవిత్ర యోగం ఏర్పడుతుంది. అయితే పంచకం మరియు భద్ర యొక్క నీడ కూడా ఈ పండుగపై ఉంటుంది.
తిల్కుండ్ చతుర్థి నాడు శుభ యోగం
ప్రతి నెలలో రెండు చతుర్థులు ఉంటాయి. ఇవి గణేశుడికి అంకితం చేయబడ్డాయి. తిల్కుండ్ చతుర్థి నాడు ఉపవాసం ఉండి వినాయకుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇవాళ అంటే గణేష్ జయంతి రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. గణపతికి అంకితమైన చతుర్థి తిథి బుధవారం వస్తుంది. అంతేకాకుండా చతుర్థి రోజున రవి మరియు పద్మ యోగం ఏర్పడుతున్నాయి. దీంతో ఈ చతుర్థికి మరింత ప్రాముఖ్యత పెరిగింది.
తిలకుండ్ చతుర్థి రోజున ఈ చర్యలు చేయండి
- తిల్కుండ్ చతుర్థి రోజున గణపతికి నైవేద్యంగా నువ్వుల లడ్డూలను పెట్టండి. పూజా అనంతరం వీటిని పంచి పెట్టండి. ఇలా చేయడం వల్ల గణపతి మీరు కోరిన కోర్కెలు తీరుస్తాడు.
- పెళ్లి కాని వారు చతుర్థి తిథి నాడు శ్రీ గణేశ స్వామికి 11 పసుపు ముద్దలను సమర్పించాలి. పూజానంతరం, వాటిని పసుపు గుడ్డలో చుట్టి, మీ గదిలో ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీకు త్వరలో కళ్యాణం జరుగుతుంది. వివాహమైన తర్వాత పసుపు ముద్దను నదిలో పారేయండి.
- సంతానం కలగాలంటే శ్రీ గణేశ భగవానుని బాల రూపాన్ని పూజించండి. దానితో పాటు సంతానం గణపతి స్తోత్రాన్ని పఠించండి.
- గణేష్ జయంతి నాడు పేదలకు ఆహారం పెట్టండి. ధాన్యాలు మెుదలైనవి దానం చేయండి. ఇలా చేయడం వల్ల అపారమైన సంపదను పొందుతారు.
Also Read: Surya Gochar 2023: ఫిబ్రవరి 13 వరకు మకరరాశిలోనే సూర్యభగవానుడు.. ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook