Makar Sankranti Date 2023: అన్ని గ్రహాలకు రారాజుగా సూర్య గ్రహాన్ని పిలుస్తారు. అయితే ఈ సూర్య గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాకుండా ఈ గ్రహ ప్రభావం 12 రాశులవారిపై కూడా పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే సూర్య గ్రహం ప్రతి నెల రాశిని మారుతూ ఇతర రాశిలోకి సంచారం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో 20 నుంచి 30 రోజుల క్రమంలో కూడా సంచారం చేసే అవకాశాలున్నాయి. అయితే జనవరి నెలలో సూర్య గ్రహం ఒక రాశి నుంచి ఇతర రాశిలోకి సంచారం చేయడాన్ని 'సంక్రాంతి' అంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సూర్య గ్రహం ఎప్పుడైతే మకరరాశిలోకి సంచారం చేస్తాడో వేదాల ప్రకారం ఆ రోజును 'మకర సంక్రాంతి' అంటారు. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు.
మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే స్నానం చేసి దానాలు చేయడం, నిరుపేదలకు ఆర్థిక సహాయాలు చేయడం వల్ల శని దేవుడి చెడు ప్రభావం కూడా సులభంగా తొలగిపోతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరం 14 జనవరి 08.44 తర్వాత సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మకర సంక్రాంతిని 15 జనవరి రోజున మకర సంక్రాంతి జరుపుకోవచ్చని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
15 జనవరి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి సూర్య భగవానుడిని నమస్కారం చేసి భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించడం వల్ల జీవితంలో కొత్త వెలుగు నిండుతుందని పూర్వీకులు పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఈ పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత పేదలకు దుప్పట్లు, బట్టలు పంపిణీ చేయాలి. ఇలా పంపిణీ చేసే దుస్తువుల్లో పసుపు రంగుతో కూడిన దుస్తువులను ఎక్కువగా పంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో నల్ల ఉల్లిని దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతుందని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న నాటి నుంచి చేస్తున్న పాపాలు కూడా సులభంగా తొలగిపోతాయి. సంక్రాంతి రోజున సూర్యుడిని పూజించే క్రమంలో గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల చాలా రకాల కోరికలు కూడా తీరుతాయని పురాతన వేదమైన 'ఋగ్వేదం' పేర్కొన్నారు.
మకర సంక్రాంతి రోజున మాంసం తినడం మానుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది మాంసాలను తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా తినడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు కలిగే ఛాన్స్ ఉందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పూజా కార్యక్రమంలో బియ్యం, శనగపప్పు, శనగపప్పు, బెల్లం, నువ్వులతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటితో తయారు చేసిన నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 'ఓం షన్ శనైశ్చరాయ నమః' అని ఏడు సార్లు జపించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది.
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook