Mangal Gochar 2023: బుధుడు రాశిలోకి కుజుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..

Mars transit 2023: ఆస్ట్రాలజీలో ధైర్యం, భూమి మరియు వివాహానికి కారకుడిగా అంగారకుడిని భావిస్తారు. కన్యా రాశిలో అంగారక సంచారం మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2023, 01:10 PM IST
Mangal Gochar 2023: బుధుడు రాశిలోకి కుజుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..

Mangal Gochar In August 2023: ప్రస్తుతం ధైర్యాన్ని ఇచ్చే కుజుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో అంగారుకుడు 45 రోజులపాటు అంటే ఆగస్టు 18 వరకు ఉండనున్నాడు. అనంతరం మార్స్ సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఆగస్ట్‌లో అంగారకుడి సంచారం మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

సింహరాశి 
కన్యారాశిలో అంగారకుడి ప్రవేశం సింహరాశి వారికి కలిసి రానుంది. మీ రాశి యెుక్క డబ్బు ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీడియా, మార్కెటింగ్, విద్య మొదలైన వాటికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. 
మకరరాశి
అంగారక గ్రహ సంచారం మకర రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ రాశి యెుక్క తొమ్మిదవ ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. మీ నాల్గవ మరియు ఆదాయ ఇంటికి కుజుడు అధిపతి. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు వివిధ వనరుల ద్వారా డబ్బు అందుతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

Also Read: Sun transit 2023: జూలై 16న సూర్య సంచారం... నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు..

వృశ్చిక రాశి
కుజ సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీ రాశికి చెందిన ఆదాయ గృహంలో దీని సంచారం జరగబోతుంది. కుజుడు మీ రాశి యెుక్క లగ్నానికి మరియు ఆరవ ఇంటికి అధిపతి. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

Also Read: Jupiter Transit: భరణి నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి.. నవంబర్ వరకు ఈ రాశులకు అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News