Mangal-Ketu Yuti 2023: కుజుడు, కేతువు స్నేహపూర్వక గ్రహాలు..ఇవి స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటాయి. కేతువు ప్రభావం కారణంగా భౌతిక విజయంలో లక్ష్యాలను సాధించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కుజుడు, కేతువు గ్రహాలు రెండు ఒకే రాశిలో కలిస్తే ప్రత్యేక యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అక్టోబర్ 3వ తేదీన తులారాశిలో కుజుడు, కేతువు గ్రహాలు కలవడం వల్ల ప్రత్యేక ప్రభావం ఏర్పడింది. ఈ ప్రభావం అక్టోబర్ 3వ తేదీ నుంచి 30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై సానుకూల ప్రభావం:
కన్య రాశి:
కుజుడు-కేతువుల కలయిక కన్య రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో డబ్బుకు ఎలాంటి కోరత ఉండదు. అంతేకాకుండా కన్యా రాశి వారికి అకస్మాత్తుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి సంభాషణ శైలి కూడా సులభంగా మెరుగుపడుతుంది. మీడియా, మార్కెటింగ్, విద్య రంగాల్లో ఉద్యోగాలు కొనసాగిస్తున్నవారికి ఈ సమయంలో గొప్ప అవకాశాలు కూడా లభిస్తాయి.
తుల రాశి:
కుజుడు-కేతువుల కలయిక చాలా శుభప్రదమైనది..తుల రాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యక్తి జీవితంలో పూర్తిగా సానుకూలంగా ఉంటాడు. ఈ గ్రహాల కలయిక కారణంగా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలతో పాటు వ్యాపారాల్లో కూడా అపారమైన విజయాలు సాధిస్తారు. దీంతో పాటు కొత్త వాహనాలు కూడా సులభంగా కొనుగోలు చేస్తారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
కుంభ రాశి:
కుజుడు-కేతువుల కలయిక ఆ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అదృష్టం మీకు అనుకూలంగా మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీర్ఘకాలికలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా ఈ సమయంలో సులభంగా ఉద్యోగాలు పొందుతారు. అంతేకాకుండా విదేశాలకు ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక తల్లిదండ్రుల మద్దతు లభించి అన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి