March Month Lucky Zodiac Sign: మార్చిలో బుధ, కుజ, శుక్ర, సూర్య గ్రహాల సంచారం.. ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!

March Month Lucky Zodiac Sign: మార్చిలో బుధ, కుజ, శుక్ర, సూర్య గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 10:28 AM IST
March Month Lucky Zodiac Sign: మార్చిలో బుధ, కుజ, శుక్ర, సూర్య గ్రహాల సంచారం.. ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!

 

March Month Lucky Zodiac Sign: ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో రాశి సంచారం చేస్తుంది. దీంతో పాటు నక్షత్రాలు కూడా సంచారం చేస్తాయి. ఈ సంచారాలకు 2024 సంవత్సరంలో మార్చి నెల ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో గ్రహాలు సంచారం చేయడమే కాకుండా ఒకే రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగాలు సమానంగా అన్ని రాశులవారిపై ప్రభావం చూపబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఉద్యోగాలు, వ్యాపారాల పరంగా అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

మార్చిలో బుధ, కుజ, శుక్ర, సూర్య గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా కొన్ని నక్షత్రాలు కూడా సంచారం చేసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు మార్చి 7న రాహువు గ్రహమైన మీన రాశిలోకి బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీంతో పాటు ఇదే రోజు శుక్రుడు కూడా శని రాశి కుంభంలోకి సంచారం చేయబోతున్నాడు. అలాగే మార్చి 14వ తేదిన సూర్యుడు మీన రాశిలోకి సంచారం చేయడం కారణంగా బుధాదిత్య యోగంతో పాటు గ్రహణ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

వృషభ రాశి:
మార్చి నెల వృషభ రాశివారికి చాలా కలిసి వస్తుంది. ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మికతపై వీరికి ఆసక్తి పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే పోటీ పరీక్షలు రాసేవారికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి అనేక మార్పులు వస్తాయి. అలాగే ఉన్నతాధికారుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. 

కుంభ రాశి:
కుంభ రాశివారికి మార్చి నెలలో శని అనుగ్రహం లభించి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో వచ్చే సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద డీల్స్‌ ఖరారవుతాయి. అంతేకాకుండా ఆదాయం పెద్ద మొత్తంలో పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కన్యారాశి:
కన్యారాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి పెద్ద సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ప్రణాళికలు కూడా రచిస్తారు. దీని కారణంగా భారీ లాభాలు పొందుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభించి విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా దాంపత్య జీవితం గడుపుతున్నవారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. 

(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News