Mars Transit​ 2022: మిథునరాశిలోకి కుజుడు ప్రవేశం..ఈ రాశులవారి జీవితం సుఖమయం..

Mars Transit​ 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనది. క్రూరుడైన అంగారకుడు ఈ నెల 16న రాశిని మార్చబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 10:54 AM IST
Mars Transit​ 2022: మిథునరాశిలోకి కుజుడు ప్రవేశం..ఈ రాశులవారి జీవితం సుఖమయం..

Mars Transit​ Positive Impact: సౌర వ్యవస్థలో అంగారకుడిని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. శక్తి, బలానికి ఇతడు కారకుడు. ఆస్ట్రాలజీలో అంగారక గ్రహాన్ని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. మేషం మరియు వృశ్చికరాశికి కుజుడు అధిపతి. సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి దాని మిత్ర గ్రహాలు. అంగారకుడికి బుధుడిని శత్రువుగా, శుక్రుడు మరియు శనిని సాధారణమైనవిగా భావిస్తారు. మృగశిర నక్షత్రం, చిత్ర నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రం అనే మూడు చంద్ర నక్షత్రాలకు కూడా అంగారకుడు అధిపతి. అక్టోబర్ 16, 2022 ఆదివారం నాడు కుజుడు మిథునరాశిలోకి (Mars Transit in Gemini 2022) ప్రవేశించనున్నాడు. మరి కుజ సంచారం ఏ రాశివారికి కలిసి రానుందో తెలుసుకుందాం.  

మేషరాశి (Aries): అంగారకుడు ఈ రాశి యెుక్క మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ స్థానం మీ ధైర్యాన్ని పెంచుతుంది. ఉద్యోగుల లైఫ్ సంతోషంగా ఉంటుంది. వీరు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో  ఐక్యత ఉంటుంది. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో పనిచేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. 
సింహరాశి (Leo): ఈ రాశికి చెందిన వ్యాపారులకు అంగారకుడి సంచారం సూపర్ ఉంటుంది. ఇప్పటి వరకు ఏయే ప్లాన్స్ వేసుకున్నారో అవన్నీ వర్క్ అవుట్ అవుతాయి. బిజినెస్ లో భారీ లాభాలను ఆర్జిస్తారు. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. విదేశాలకు వెళ్లే  అవకాశం ఉంది. అన్నదమ్ముల సపోర్టు లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మీ పనికి ప్రశంసలను అందుకుంటారు. 

కన్యారాశి (Cancer): అంగారక గ్రహ సంచార సమయంలో అనేక వృత్తిపరమైన ఆందోళనలు నుండి ఉపశమనం పొందవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఈ రాశివారు వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. ఫ్యామిలీతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించాలి. స్పైసీ పుడ్ కు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగులకు ఈ సమయం లాభిస్తుంది.
మకరరాశి (Capricorn): మిథునరాశిలో కుజుడు సంచారం వల్ల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రకృతి ఒడిలో గడిపే అవకాశం ఉంది. ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారు మంచి లాభాలు పొందుతారు. 
మీనరాశి (Pisces): కుజుడు సంచారం వల్ల మీనరాశి వారు సొంత ఇంటి కల నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. తల్లి ఆరోగ్యం చెడే అవకాశం ఉంది కాబట్టి ఆమె హెల్త్ పట్ల జాగ్రత్త తీసుకోండి. పెళ్లికాని యువతీయువకులకు వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 

Also Read: Surya Dev: తులరాశిలోకి సూర్యభగవానుడు.. ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News