Mauni Amavasya 2024: మౌని అమావాస్య ఎప్పుడు? ఆ రోజు చేయాల్సిన పనులేంటి?

Mauni Amavasya 2024: మాఘ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనినే మౌని అమావాస్య అంటారు. ఈరోజున గంగాస్నానం చేసి విష్ణుమూర్తి ఆరాధించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 04:32 PM IST
Mauni Amavasya 2024: మౌని అమావాస్య ఎప్పుడు? ఆ రోజు చేయాల్సిన పనులేంటి?

Magh amavasya importance in Telugu: హిందూ మతంలో ఏకాదశి, పూర్ణిమ మరియు అమావాస్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసంలో వచ్చే అమావాస్యనే  మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున ఋషి మనువు జన్మించాడు కాబట్టి దీనిని మౌని అమావాస్య అంటారు. వచ్చే సంవత్సరం మౌని అమావాస్య ఫిబ్రవరి 9న వస్తుంది. మౌని అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈరోజు ఉపవాసం చేస్తారు. మౌని అమావాస్య రోజున గంగాస్నానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మోక్షం కూడా లభిస్తుంది. మౌని అమావాస్య రోజు గంగానదిలోని నీరు అమృతంగా మారుతుందని.. అందుకే ఆరోజు గంగాలో స్నాం చేస్తే శుభప్రదమని నమ్ముతారు. 

మౌని అమావాస్య ప్రాముఖ్యత
మౌని అమావాస్య రోజున పూర్వీకుల పేరుతో నీళ్లలో నువ్వులు వేసి దక్షిణ దిశలో తర్పణం వదిలాలి. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం. కాబట్టి ఈ రోజున పూర్వీకులకు ప్రార్థనలు చేస్తే వారికి ఆత్మకు చేకూరుతుంది. అంతేకాకుండా పితృదోషాలు తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజున మర్రి చెట్టును పూజించి.. దాని చుట్టూ పవిత్రమైన పసుపు దారాన్ని 108 సార్లు కట్టడం వల్ల మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మౌని అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించి.. గీతలోని ఏడవ అధ్యాయాన్ని పఠిస్తే పితృ బాధలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల గుర్తు చేసుకుని.. వారి పేరు మీద ఆహారం, బట్టలు దానం చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్నీ సమస్యలు పోతాయి.

Also Read: Rahu Gochar 2024: మీన రాశిలో రాహు సంచారం.. ఏడాదంతా ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News