Magha Purnima Dos and Don'ts: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మాఘ పౌర్ణమి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వస్తుంది. ఈ రోజు భక్తులంతా శివపార్వతులను పూజించి ఉపవాసాలు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కామవ్వడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని ఒక నమ్మకం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న (ఈ రోజు) వచ్చింది. అయితే ఈ మాఘ పౌర్ణమి ప్రత్యేకతేంటో..ఈ రోజు ఎలాంటి పనులు చేయాలో..ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రత్యేకతలు:
ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. రోజు వచ్చే చంద్రుడి కంటే రెండు రేట్లు అధికంగా పెద్దిగా కనిపిస్తాడు. అంతేకాకుండా ఈ రోజు పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. ఇలా స్నానం చేసి శివపార్వతులను పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా కొంతమంది గురువును కూడా పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల జ్ఞాన, విద్యా ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం.
విశిష్టతలు:
ఈ రోజు చాలా మంచి ఉత్తరాది ప్రజలు రంగులతో ఆడుకునే ఆనవాయితి కూడా ఉంది. ఎందుకంటే ఈ పండగ హోళీ పండుగకు కొన్ని రోజుల ముందు వస్తుంది. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున పూజ తర్వాత రంగులను పూసుకుంటూ నృత్యాలు కూడా చేస్తారు. అంతేకాకుండా చాలా మంది ఈ పౌర్ణమిని గురు పూర్ణిమగా కూడా భావిస్తారు. ఈ రోజు శిష్యులు తమ గురువులకు పాద పూజలు చేసి, వారి ఆశీస్సులు పొందుతారు. ఇలా చేయడం వల్ల విద్యా బుద్ధులు కూడా పెరుగుతాయి.
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
చేయాల్సిన పనులు:
✾ పవిత్ర నదులలో స్నానం చేయడం.
✾ శివుడిని, పార్వతిని పూజించడం.
✾ గురువును పూజించడం.
✾ దాన ధర్మాలు చేయడం.
✾ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం.
చేయకూడని పనులు:
✾ మాంసం, మద్యం సేవించకూడదు.
✾ కోపం, తిట్టడం వంటివి చేయకూడదు.
✾ ఎవరినీ బాధపెట్టకూడదు.
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter