Mercury Combust 2023: బుధగ్రహం అస్తమయం ఆ 4 గ్రహాలకు తస్మాత్ జాగ్రత్త, ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Mercury Combust 2023: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల పరివర్తనం లేదా గోచారం ప్రభావం అన్నిరాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు లాభదాయకంగా, మరి కొన్నిరాశులకు ప్రతికూలంగా ఉండనుంది. అదే విధంగా గ్రహాల అస్తమయం కూడా ప్రభావం చూపిస్తుంటుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 26, 2023, 08:26 AM IST
Mercury Combust 2023: బుధగ్రహం అస్తమయం ఆ 4 గ్రహాలకు తస్మాత్ జాగ్రత్త, ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Mercury Combust 2023: జ్యోతిష్యం ప్రకారం బుధుడు వృషభ రాశిలో అస్తమించనున్నాడు. హిందూమత విశ్వాసాల ప్రకారం బుద్ధుడిని బుద్ధి, తర్కానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి బుధ గ్రహం వృషభ రాశిలో అస్తమించనుండటం కచ్చితంగా ప్రతికూల ప్రభావమే కల్గిస్తుంది. ముఖ్యంగా 4 రాశులవారిపై పెను ప్రమాదం విరుచుకుపడనుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ నష్టముంటుంది.

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుండలిలో బుధుడు పటిష్టంగా ఉంటే తెలివితేటలు, ఆరోగ్యం, జీవితంలో సంతృప్తి లభిస్తాయంటారు. బుధుడు బుద్ధి, తర్కానికి ప్రతీక అయినందున వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో విజయం ఉంటుంది. అదే సమయంలో ఎవరి జాతకం కుండలిలో బుధుడు రాహు కేతువులు లేదా మంగళ గ్రహంతో ఉంటాడో ఆ రాసులపై ప్రతికూల ప్రభావం కన్పిస్తుంది. బుధ గ్రహం వృషభరాశిలో అస్తమించడంతో ఏర్పడే యుతి కారణంగా ఈ జాతకులకు ఏదీ కలిసిరాదు. అన్నింటా నష్టాలే ఎదురౌతాయి. ఫలితంగా నిద్రలేమి, చర్మ సంబంధిత వ్యాదులు, రక్త నాళాల సమస్యలు ఏర్పడవచ్చు. బుధుడు జూన్ 19వ తేదీన వృషభరాశిలో అస్తమించనున్నాడు. ఫలితంగా 4 రాశులవారికి తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. 

తుల రాశి జాతకులకు బుధుడి రాశి అస్తమయం ప్రభావంతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురౌతాయి. ఆర్ధికంగా నష్టాలు ఎదుర్కొంటారు. అందుకే డబ్బు వ్యవహారాల్లో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇక ఉద్యోగపరంగా మీరు ఎదురుచూస్తే పదోన్నతి ఆలస్యమౌతుంది. బుధుడు వృషభ రాశిలో అస్తమించడంతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీన్నించి కాపాడుకునేందుకు యోగా మంచి ప్రత్యామ్నాయం కాగలదు.

బుధ గ్రహం వృషభ రాశిలో అస్తమించనుండటంతో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. శరీరంలోని రోగ నిరోధక శక్తి సైతం క్షీణిస్తుంది. ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. పెళ్లి జీవితంలో సైతం సమస్యలే ఉంటాయి. కంటి సంబంధిత సమస్యలు వెంటాడవచ్చు.

వృషభ రాఖిలో బుధుడు అస్తమించనుండటంతో ఈ జాతకులకు సమస్యాత్మకంగా ఉంటుంది. ప్రయాణాల్లో నష్టాలు ఎదురుకావచ్చు. చాలా సందర్భాల్లో ఎంతో కష్టపడినా ఆశించిన ప్రయోజనం చేకూరదు. ఆదాయం తగ్గిపోతుంది. ఖర్చులు పెరగనున్నాయి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. 

బుధుడు అస్తమించడం వల్ల చాలామంది జాతకులకు ప్రతికూల ప్రభావమే కన్పిస్తుది. ప్రేమ జీవితంలో కొన్నిపొరపాట్ల ప్రభావం జీవితంపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి. వ్యాపారంలో తీరని నష్టం కలుగుతుంది. ఆర్ధికంగా తీవ్రమై నష్టాల్లో ఉంటారు. ఏ విధమైన సహాయం ఎక్కడి నుంచీ అందే పరిస్థితి ఉండదు.

Also read: Sun in Rohini Effect 2023: సూర్యుడి రోహిణి నక్షత్ర ప్రవేశంతో ఈ 5 రాశులకు ఊహించని ధనలాభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News