Budh Gochar 2023: బుధుడు ప్రత్యక్ష సంచారం.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Mercury transit 2024: గ్రహాల యువరాజైన బుధుడు వచ్చే ఏడాది ప్రారంభంలో తన గమనాన్ని మార్చనున్నాడు. మెర్క్యూరీ రాశి మార్పు మూడు రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 09:15 PM IST
Budh Gochar 2023: బుధుడు ప్రత్యక్ష సంచారం.. కొత్త సంవత్సరంలో ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

Budh Gochar in Scorpio 2024: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిని పిలుస్తారు. ఇతడిని మిథునం మరియు కన్యారాశులకు అధిపతిగా భావిస్తారు. మీ జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే మీరు వృత్తి, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం ధనుస్సు రాశిలో సంచరిస్తున్న మెర్క్యూరీ.. ఈ నెల 28న వృశ్చిక రాశిలోకి ప్రవేశించనుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 02న బుధుడు మళ్లీ తన గమనాన్ని మార్చుకుని ప్రత్యక్షంగా మారనున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి 
ఇదే రాశిలో బుధుడి నేరుగా నడవనున్నాడు. దీంతో ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. 
కన్యా రాశి 
కన్యారాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉంటారు. దీని కారణంగా ఈ రాశి వారు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
మకర రాశి
బుధుడు ప్రత్యక్ష సంచారం మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఊహించని ధనాన్ని పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం మీ జీవితంలో వెలుగులు విరజల్లుతాయి. 

Also Read: Saturn transit 2024: వచ్చే ఏడాది అంతా ఈ మూడు రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News