Mercury Double Transit In December: డిసెంబరులో 2 సార్లు స్థానాన్ని మార్చనున్న బుధుడు.. ఈ రాశులకు ఊహించనంత ధనం

Mercury Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధ గ్రహం డిసెంబర్‌లో రెండుసార్లు సంచరించబోతోంది. మెర్క్యురీ యొక్క ఈ సంచారం 3 రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2022, 07:39 PM IST
  • డిసెంబరులో బుధుడి యెుక్క రాశి మార్పు
  • వీరికి కెరీర్ మరియు వ్యాపారంలో విజయం
Mercury Double Transit In December: డిసెంబరులో 2 సార్లు స్థానాన్ని మార్చనున్న బుధుడు.. ఈ రాశులకు ఊహించనంత ధనం

Mercury Transit In Dhanu Zodiac: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది. ఇది ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాల యువరాజు బుధుడు డిసెంబరులో రెండు సార్లు తన స్థానాన్ని (Mercury Transit 2022) మార్చనున్నాడు. బుద్ధి, కమ్యూనికేషన్ కు కారకుడైన బుధుడి యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం (Aries): మెర్క్యురీ యొక్క సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు.  మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల మీకు లాభం ఉంటుంది. వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. 
వృషభం (Taurus): బుధగ్రహం యొక్క రాశి మార్పు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. బిజినెస్ విస్తరిస్తుంది. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీడియా, ఫ్యాషన్, డిజైనింగ్ రంగాలకు సంబంధించిన వ్యక్తులు భారీగా లాభపడతారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆఫీసులో మీ సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. 
కన్య (Virgo): మెర్క్యురీ సంచారమ వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. షేర్లు, బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభం పొందుతారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఏదైనా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

Also Read: Today Rasi Phalalu: నవంబర్ 19 రాశిఫలాలు.. ఇవాళ ఈరాశివారిని అదృష్టం వరిస్తుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News