Mercury Retrograde 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధ గ్రహాన్ని బుద్ధి, ధనం, వ్యాపారాలకు కారకుడిగా భావిస్తారు. అటువంటి బుధుడు వక్రమార్గంలో పయనించడం కొన్ని రాశులపై ఊహించని లాభాల్ని కురిపించనుంది. అదృష్టం మార్చేయనుంది. ఊహించని ధనవర్షం కురుస్తుంది. బుధుడి వక్రమార్గం ఏయే రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం..
హిందూ పంచాంగం ప్రకారం బుధ గోచారం, బుధ వక్రమార్గం రెండూ వేర్వేరు. ఇప్పుడు బుధుడు వర్గమార్గం పట్టనున్నాడు. మంగళ గ్రహం రాశిగా ఉన్న మేషరాశిలో బుధుడు వక్రమార్గం పట్టనున్నాడు. ఫలితంగా ఆర్ధిక పరిస్థితులు, కెరీర్, వ్యాపారం ఇలా అన్నింటిపై ప్రభావం చూపించనుంది. బుధుడు వాస్తవానికి వేగంగా పయనించే గ్రహం. అందుకే రాశి మారడానికి పెద్దగా సమయం పట్టదు. బుధ గ్రహం ఏప్రిల్ 21, 2023 మద్యాహ్నం 1 గంట 25 నిమిషాలకు వక్రమార్గం పట్టనున్నాడు. బుధుడి వక్రమార్గం శుభ ప్రభావం 5 రాశులపై ఉంటుంది.
కుంభ రాశిపై ప్రభావం
బుధుడి వక్రమార్గం ప్రభావం కుంభ రాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో కీలకమైన లాభాల్ని ఆర్జించిపెడుతుంది. కెరీర్‌కు చాలా అనువైన సమయమిది. పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు. విజయం మీవైపే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏ సమస్యలు తలెత్తవు. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.
మీనరాశిపై బుధుడి వక్రమార్గం ప్రభావం
బుధగ్రహం వక్రమార్గం కారణంగా మంచి ఫలితాలు ఎదురౌతాయి. రచన, వ్యక్తిత్వ వికాస రంగాల్లో అపారమైన లాభాలుంటాయి. వ్యాపారం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది.
మేష రాశి
బుధుడి మేష రాశిలో వక్రమార్గం కారణంగా కెరీర్‌లో ఉన్నత స్థానం లబిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారస్థులకు లాభాలు భారీగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. ప్రత్యర్ధులు పరాజయం పొందుతారు. అంతులేని ధనలాభం కలుగుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి.
సింహ రాశిపై ఎలాంటి ప్రభావం
బుధుడి వక్రమార్గం ప్రభావం సింహ రాశి జాతకాలకు ఊహించని లాభాలు కలగజేయనుంది కుటుంబ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభాలుంటాయి. రాజకీయాల్లో కీలక స్థానాల్ని అధిరోహిస్తారు. అదృష్టం తోడుగా ఉంటుంది.
మిధున రాశి
బుధుడి వక్రమార్గం ప్రభావంతో మిథున రాశి జాతకులకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, ఇంక్రిమెంట్లు తప్పనిసరి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు అందుతాయి. సుదూర ప్రయాణాలు చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook