Grah Gochar 2023: ఏప్రిల్ 1 నుండి ఈ 3 రాశుల జీవితం అల్లకల్లోలం.. ఇందులో మీ రాశి ఉందా?

Budh Gochar 2023: ఇవాళ బుధుడు మేషరాశిలో సంచరించాడు. మెర్క్యూరీ రాశి మార్పు కొన్ని రాశులవారికి సమస్యలను పెంచుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 08:03 PM IST
Grah Gochar 2023: ఏప్రిల్ 1 నుండి ఈ 3 రాశుల జీవితం అల్లకల్లోలం.. ఇందులో మీ రాశి ఉందా?

Budh Gochar Negative Impact On Zodiac 2023:  జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, బుధ గ్రహం మేధస్సు, తార్కిక సామర్థ్యం మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలకు కారకుడిగా భావిస్తారు. మిథునం మరియు కన్యా రాశులకు అధిపతిగా బుధుడిని భావిస్తారు.  ఇవాళమధ్యాహ్నం 02:44 గంటలకు బుధుడు మేషరాశిలో సంచరించాడు. మేష రాశికి అధిపతి మార్స్. అంగారకుడు, బుధుడు శత్రువులు. మేషరాశిలో బుధుడు సంచారం వల్ల కొన్ని రాశులవారికి సమస్యలు పెరగనున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

బుధుడి సంచారం ఈ రాశులకు నరకం
వృషభం- మేషరాశిలో బుధుని సంచారం వృషభ రాశి వారికి అంత మంచిది కాదు. ఈ రాశి యెుక్క  రెండవ మరియు ఐదవ ఇంటికి అధిపతి బుధుడు. ఇతడి సంచారం పన్నెండవ ఇంట్లో జరుగుతోంది. దీని కారణంగా మీ ఖర్చులు విపరీతంగా పెరగనున్నాయి. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ లైఫ్ పార్టనర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. 
కన్య - కన్యారాశి యొక్క దశమ మరియు లగ్న స్థానానికి అధిపతి అయిన బుధుడు ఎనిమిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీ జీవితంలో ఆకస్మిక సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. మిమ్మల్ని వ్యాధులు చుట్టముడతాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. ఈసమయంలో ఆలోచించి మాట్లాడండి. 
వృశ్చికం - వృశ్చిక రాశి యెుక్క బుధుడు పదకొండవ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి. పైగా మార్చి 31న అతడు ఆరో ఇంటిలో సంచరిస్తున్నాడు. దీంతో మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. మీ మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. ఆర్థికంగా మీ పరిస్థితి దిగజారుతుంది.

Also read: Gajalakshmi Rajyog: గజలక్ష్మీ రాజయోగం ఈ రాశులవారికి ప్రత్యేకం... ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News