Mercury Transit 2023 effect: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇతడిని వ్యాపారం, సంపద మరియు తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో మెర్క్యూరీ మంచి స్థానంలో ఉంటే వారికి దేనికీ లోటు ఉండదు. ఇటీవల బుధుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే శుక్రుడు అదే రాశిలో సంచరిస్తున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఐదు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
బుధుడి సంచారం ఈ రాశులకు వరం
సింహ రాశి: ఇదే రాశిలోనే లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. అప్పుల నుంచి బయటపడతారు.
తుల రాశి: మెర్క్యూరీ రాశి మార్పు తుల రాశి వారికి లాభాలను ఇస్తుంది. జాబ్ చేసేవారు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు.
కుంభం: బుధుడి సంచారం కుంభరాశి వారికి కలిసి వస్తుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
మేషం: లక్ష్మీనారాయణ రాజయోగం మేషరాశి వారికి మేలు చేస్తుంది. బుధుడి సంచారం వల్ల మీ తెలివితేటలు పెరుగుతాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారు ప్రయోజనం పొందుతారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి : బుధుడి సంచారం వల్ల మిథునరాశి వారికి లక్ కలిసి వస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సాహిత్య రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: zodiac signs: అరుదైన యోగంతో ఊహించని లాభాలు పొందే రాశులవారు వీరే..నెల మొత్తం లాభాలే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook