Mercury Transit 2024: బుధుడి తిరోగమనంతో ఊహించని లగ్జరీ లైఫ్‌ పొందబోయే రాశులు!

Mercury Direct Horoscope 2024: బుధుడి తిరోగమనానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 24, 2024, 10:46 AM IST
Mercury Transit 2024: బుధుడి తిరోగమనంతో ఊహించని లగ్జరీ లైఫ్‌ పొందబోయే రాశులు!

Mercury Direct Horoscope 2024:  జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో.. తిరోగమనాలకు కూడా అలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. అయితే గ్రహాలకు యువ రాజుగా భావించే బుధుడు ఇదే నెలలో తిరోగమనం చేయబోతోంది. ఆగస్టు 5 తర్వాత ఈ గ్రహం కదలికలు జరపబోతోంది. కాబట్టి కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. బుధ గ్రహం ఆగష్టు 29న ఉదయం 2:43 గంటలకు నేరుగా కర్కాటక రాశిలోకి తిరోగమనం దశగా ప్రవేశించబోతోంది. ఈ గ్రహం ప్రత్యేక్షంగా సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే బుధుడి అనుగ్రహం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభరాశి:
బుధుడి ప్రత్యేక్ష సంచారం కారణంగా వృషభ రాశివారికి అనేక సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. ముఖ్యంగా ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దీంతో పాటు కెరీర్‌ పరంగా గోల్డెన్‌ ఛాన్స్‌లు కూడా పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు శత్రువుల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా కోర్టు కేసులు అనుభవిస్తున్నవారికి విజయాలు కూడా కలుగుతాయి. అలాగే ఊహించని ధన ప్రవాహాలు కూడా కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుటుంబ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది. 

కర్కాటక రాశి:
బుధుడి ప్రత్యక్ష సంచారం ప్రభావం కర్కాటక రాశివారిపై కూడా పడుతుంది. దీని కారణంగా వీరికి ఆశించిన ధన లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఆస్తి వివాదాలు ఎదుర్కొంటున్నవారికి ఈ సమయంలో విముక్తి లభించబోతోంది. అంతేకాకుండా అన్ని రకాల వివాదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. అలాగే ఎలాంటి రంగాల్లో పనులు చేసేవారైనా ఈ సమయంలో ఊహించని విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో వస్తున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దీంతో పాటు భార్య మీపై ఎంతో ప్రేమను చూపుతుంది. దీంతో పాటు కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు.

కన్యారాశి:
కన్నా రాశివారిపై కూడా బుధుడి తిరోగమన ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరిగి అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా బంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే ప్రేమ జీవితంలో కూడా సమస్యలు తొలగిపోతాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News