Mercury Transit in Sagittarius 2022: జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడు అంటారు. బుధుడు.. సంపద, తెలివితేటలు, తర్కం, కమ్యూనికేషన్ మరియు వ్యాపారానికి కారకుడు. బుధుడు సాధారణంగా ఒక రాశిలో 23 రోజులు ఉంటాడు. వచ్చే డిసెంబర్ 3, 2022న బుధుడు వృశ్చికరాశిని విడిచిపెట్టి ధనుస్సు రాశిలోకి (Mercury Transit in Sagittarius 2022) ప్రవేశించనుంది. బుధ సంచారం వల్ల ఏ రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.
మిథునం (Gemini): మిథునరాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. దీంతో వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. బిజినెస్ లో పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు ప్రయోజనాలను పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. దీంతో ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది.
సింహం (Leo): బుధుడు మారడం వల్ల సింహ రాశి వారు శుభఫలితాలను పొందుతారు. కెరీర్ పరంగా ఈ సమయం మీకు బాగుంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. షేర్ మార్కెట్, లాటరీ మొదలైన వాటి నుండి లాభాలు పొందే అవకాశం ఉంది. పాత పెట్టుబడి కూడా మీకు లాభిస్తుంది. ప్రేమ జీవితానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
కన్య (virgo): బుధ సంచారం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ప్రాపర్టీ-కార్ మొదలైన వాటి విషయంలో విశేష ప్రయోజనాలు పొందుతారు. ఫ్యామిలీ సపోర్టుతో మీ పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. దేనిలోనైనా పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు.
ధనుస్సు (Sagittarius): బుధ గ్రహం ఈ రాశిలోకే ప్రవేశిస్తుంది. దీంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసి వచ్చి మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సమయం బాగానే ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారులు, ఉద్యోగులు ఈ సమయంలో మంచి లాభాలను గడిస్తారు.
Also Read: Guru Margi 2022: మీన రాశిలోకి బృహస్పతి గ్రహం ఈ రాశువారి అన్ని నష్టాలే.. ఎందుకో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి