Mercury Transit August 2022: కన్య రాశిలో బుధుడు సంచారం.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!

Mercury Transit August 2022: ఆగస్టు 21న బుధుడు తన  సొంత రాశి అయిన కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని సంచారం 5 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 10:40 AM IST
Mercury Transit August 2022: కన్య రాశిలో బుధుడు సంచారం.. ఈ 5 రాశులకు డబ్బే డబ్బు!

Mercury Transit August 2022: మరో రెండు రోజుల్లో బుధుడు తన రాశిని మార్చనున్నాడు. ఆగస్టు 21న బుధుడు కన్య రాశిలోకి (Mercury Transit in virgo 2022) ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ 5 రాశులకు శుభప్రదం
వృషభరాశి (Taurus): బుధ సంచారం ఈ రాశి విద్యార్థులకు వరం. వీరు విద్యారంగంలో రాణిస్తారు. లవ్ లైఫ్ బాగుంటుంది. మీ వ్యాపారం కూడా విస్తరిస్తుంది. ఈ సమయంలో కొంతమందికి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. 
మిథునరాశి (Gemini): మిథున రాశి వారికి బుధ సంచారం చాలా మేలు చేస్తుంది. వీరి కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. కెరీర్ లో పురోగతి ఉంటుంది. 
సింహరాశి (Leo): సింహరాశికి చెందిన రెండో ఇంటిలో బుధుడు సంచరిస్తాడు. రాజకీయాల్లో ఉన్నవారికి లాభం చేకూరుతుంది. పూర్వీకుల వ్యాపారం నుండి ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. 
కన్య రాశి (Virgo): బుధుడు సొంతరాశిలోనే సంచరించడం వల్ల ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. పోటీపరీక్షలకు సిద్దమవుతున్నవారు విజయం సాధిస్తారు. ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం కలిసివస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారు ఈ సంచారం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ విషయంలో క్లారిటీ వస్తుంది. ఆఫీసులో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన మహిళలు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. 

Also Read: Mercury Transit 2022: మరో 72 గంటల్లో ఈ 4 రాశుల అదృష్టం మారబోతుంది? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News