Mokshda Ekadashi 2023: మోక్షద ఏకాదశి ప్రత్యేకత, తిథి సమయాలు, ప్రత్యేక శుభ సమయాలు..

Mokshda Ekadashi 2023: హిందూ సంప్రదాయంలో మోక్షద ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2023, 11:10 AM IST
Mokshda Ekadashi 2023: మోక్షద ఏకాదశి ప్రత్యేకత, తిథి సమయాలు, ప్రత్యేక శుభ సమయాలు..

 

Mokshda Ekadashi 2023: హిందూ సంప్రదాయంలో ఏకాదశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా డిసెంబర్‌ నెలలో వచ్చే ఏకాదశికియ గొప్ప ప్రముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అంటారు. అయితే ఈ సారి రాబోయే ఏకాదశి తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..ఏకాదశి తిథి సూర్యోదయం జరిగిన తర్వాత మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ముగుస్తుంది. త్వరలోనే రాబోయే ఏకాదశిలో భాగంగా ఉదయ తిథిని నమ్మేవారికి ఏకాదశి తిథి సమయం ఉండకపోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది మోక్షద ఏకాద డిసెంబర్ 23న కూడా జరుపుకుంటున్నారు. ఈ మోక్షద ఏకాదశి రోజే శ్రీ కృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశించాడు. కాబట్టి ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

భారతదేశంలో కొన్ని రాష్ట్రాల ప్రజలు ఈ మోక్షద ఏకాదశిని పండగలా కూడా జరుపుకుంటారు. ఈ రోజు ఉత్తర భారతీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. దీంతో పాటు చాలా మంది ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో బాధలతో పాటు కష్టాలు కూడా తొలగిపోతాయి. అలాగే గీతా జ్ఞానం కూడా  మార్గశీర్ష మోక్షద ఏకాదశి రోజే శ్రీకృష్ణు ఉపదేశం చేశారని భక్తుల నమ్మకం. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. 
కాలం నుంచి కొనసాగుతోంది.

Also Read: Health Tips: రోజూ ఉదయం పాలు, అరటి పండ్లు తీసుకుంటే ఆ 5 సమస్యలకు చెక్

ఏకాదశి తిథి సమయాలు:
ఏకాదశి తిథి డిసెంబర్ 22 ఉదయం 08:16 నుంచి ప్రారంభమవుతుంది. 
ఈ తిథి డిసెంబర్ 23 ఉదయం 07:11 ముగుస్తుంది.
ఉపవాస విరమణ సమయం మధ్యాహ్నం 01:22 నుంచి 03:26 PM వరకు..
ఏకాదశి తిథి చివరి ముగింపు సమయం రాత్రి 12:59కు..

మోక్షద ఏకాదశి తిథి ప్రత్యేక సమయం:
ఈ సంవత్సరం మోక్షదా ఏకాదశి భాగంగా వ్రతాన్ని, ఉపవాసాలను పాటించేవారు డిసెంబర్ 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. కాబట్టి మోక్షద ఏకాదశి తిథి ఉపవాసాలు పాటిస్తే ఊహించని లాభాలు కలుగుతాయి. 

Also Read: Health Tips: రోజూ ఉదయం పాలు, అరటి పండ్లు తీసుకుంటే ఆ 5 సమస్యలకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News