ఇవాళ కార్తీక పౌర్ణమిలో చంద్రగ్రహణం, 580 ఏళ్ల తరువాత తిరిగి ఇదే

Karthika Pournami: పౌర్ణమి అంటే హిందూవులకు అత్యంత పవిత్రమైనది. ఇష్టదైవం శివునికి ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 580 సంవత్సరాల ప్రత్యేకత ఉంది. ఈసారి కార్తీక పౌర్ణమికి. అదేంటో చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2021, 08:14 AM IST
  • ఇవాళ్టి కార్తీక పౌర్ణమికి అరుదైన ప్రత్యేకత
  • కార్తీక పౌర్ణమి నాడే పాక్షిక చంద్రగ్రహణం
  • 580 ఏళ్ల తరువాత సుదీర్ఘకాలం సాగే పాక్షిక చంద్రగ్రహణం ఇదే
ఇవాళ కార్తీక పౌర్ణమిలో చంద్రగ్రహణం, 580 ఏళ్ల తరువాత తిరిగి ఇదే

Karthika Pournami: పౌర్ణమి అంటే హిందూవులకు అత్యంత పవిత్రమైనది. ఇష్టదైవం శివునికి ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 580 సంవత్సరాల ప్రత్యేకత ఉంది. ఈసారి కార్తీక పౌర్ణమికి. అదేంటో చూద్దాం.

పవిత్ర కార్తీక మాసంలో(Karthika masam)ఏర్పడే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శివాలయాల్లో జ్వాలాతోరణాలు వెలుస్తుంటాయి. ఆకాశ దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు. శైవ, వైష్ణవాలయాలన్నీ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగే రోజు అది. అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తుంటారు. మహా శివుడికి లక్షబిల్వార్చన, లక్షవత్తులు, లక్షరుద్ర పూజలను నిర్వహిస్తారు. మహా శివరాత్రికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. అదే స్థాయిలో కార్తీక పౌర్ణమి నాడు తమ భక్తి ప్రపత్తులను చాటుతుంటారు. అయితే ఈసారి కార్తీక పౌర్ణమికి అతి ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. 

ఇవాళ్టి కార్తీక పౌర్ణమి(Karthika Pournami) నాడే పాక్షిక చంద్రగ్రహణం

ఇవాళ పాక్షిక చంద్రగ్రహణం కావడమే ఆ ప్రత్యేకత కాదు. సుదీర్ఘకాలం సాగే చంద్రగ్రహణం ఇవాళ. సుదీర్ఘకాలం సాగే చంద్రగ్రహణం(Moonar Eclipse) ఏర్పడటం దాదాపు 580 ఏళ్ల తరువాత తిరిగి ఇదే. ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే కన్పించనుంది. ఈశాన్యం వైపు మారుమూల ప్రాంతాల్లో మాత్రమే చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. ఉత్తరాది యూరోప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహా సముద్రం ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం చూసే వీలుంటుంది. 

కార్తీకంలో చంద్రగ్రహణం..ఏం చేయకూడదు

గ్రహణ కాలంలో చేయకూడని పనులంటూ కొన్ని ఉన్నాయి. గ్రహణ కాలంలో కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. గ్రహణ కాలంలో ఆహారాన్ని తీసుకోకూడదు. నిద్ర పోకూడదు. గ్రహణం ఆరంభానికి ముందు వండిన ఆహార పదార్థాలు గ్రహణ కాలం ముగిసిన తరువాత తినకూడదు. గ్రహణానికి ముందు నూనె, నెయ్యితో వండిన పదార్థాలపై దర్భను ఉంచాలి. నిత్యావసర వస్తువుల్లో దర్భం ముక్కలను ఉంచాలి. దీనివల్ల గ్రహణ దోషం వాటికి పట్టదు. గ్రహణం పూర్తయిన తరవాత ఇంట్లో దేవుడి పటాలను శుద్ధి చేసుకోవాలి. విగ్రహాలు గానీ, యంత్రాలను గానీ పూజించే ఆచారం ఉన్నవారు పంచామృతంతో సంప్రోక్షణ చేయాలి. నరదృష్టి తొలిగేందుకు ఇళ్లు, దుకాణాల ముందు కట్టిన గుమ్మడి కాయలు, కొబ్బరి కాయలను తొలగించి కొత్తవి అమర్చుకోవాలి. 

గ్రహణ కాలంలో గర్భిణీలు బయట తిరగకూడదు. ఆ వెలుగు శరీరం మీద పడకుండా జాగ్రత్త వహించాలి. గ్రహణం నీడ గానీ, వెలుతురు గానీ ప్రసరించకూడదు. చంద్ర గ్రహణానికి(Moonar Eclipse), సూర్యగ్రహణానికి ఈ నియమం కచ్చితంగా వర్తిస్తుంది. మనస్సులో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. 

Also read: నవంబర్ 18 కార్తీక పౌర్ణమి నాడు ఇవాళ మీ రాశి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News