నవంబర్ 18 కార్తీక పౌర్ణమి నాడు ఇవాళ మీ రాశి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope for November 18: గ్రహాలు, తిథి, నక్షత్రం అంశాలకు అనుగుణంగా రాశి ఫలాల్ని. సదరు వ్యక్తులకు ఎదురయ్యే మంచి చెడుల్ని నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. గ్రహాల కదలిక ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుండే ఈ రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాశివారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి నాడు.. మీ రాశి ఫలాలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 18, 2021, 02:41 PM IST
నవంబర్ 18 కార్తీక పౌర్ణమి నాడు ఇవాళ మీ రాశి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope for November 18: జ్యోతిషశాస్త్రం అనేది సృష్టిలో గ్రహాల కదలికల ఆధారంగా..వ్యక్తుల జన్మతిధి ఆధారంగా లెక్కలు వేసి చెప్పేది. కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు గానీ జ్యోతిషశాస్త్రమనేది భారతదేశంలో చాలా ప్రాచుర్యంలో ఉంది. గ్రహాలు, తిథి, నక్షత్రం అంశాల ఆధారంగా రాశి ఫలాల్ని, ఆయా వ్యక్తులకు వ్యక్తుల మంచి చెడుల్ని చెబుతుంటారు పండితులు. గ్రహాల కదలికల్ని బట్టి ఎప్పటికప్పుడు రాశి ఫలాలు మారుతుంటాయంటారు. ఈ రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాశివారికి పరిస్థితులు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటాయి. ఇవాళ కార్తీక పౌర్ణమి నాడు.. మీ రాశి ఫలాలు ఇవాళ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషరాశి Aries: ఈ రాశిలో పుట్టినవారు కష్టపడితే కచ్చితంగా మంచి ఫలితాలు  ఉంటాయి.  కొత్త కార్యక్రమాలను, నిర్ణయాల్ని కుటుంబ సభ్యుల ఆమోదం తరువాతే ప్రారంభిస్తే మంచిదంటున్నారు. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త అందుతుంది.ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచి ఫలాలు లభిస్తాయి.

వృషభరాశి Taurus:  ఈ రాశివారికి  పూర్తిగా శుభం కలుగుతుంది. మానసిక ఉల్లాసం, ప్రారంభించిన పనులు జయప్రదంగా ముగియడం వంటివి ఉంటాయి. మానిసిక ఆనందం లేదా సుఖం ప్రాప్తిస్తుంది. శివుడిని పూజిస్తే మంచిది.

మిధునరాశి Gemini:  ఈ రాశిలో పుట్టినవారి పనులు సకాలంలో పూర్తవుతాయి. దీన్నే కార్యసిద్ధి అంటారు. దేవుని మద్దతుతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రారంరంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. విందు,వినోదం వంటి  కార్యక్రమాలలో పాల్గొంటారు.లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదంటున్నారు.

కర్కాటకరాశి Cancer:  ఈ రాశిలో పుట్టినవారికి శుభ కార్యాలు ఎదురవుతాయి. అంతా మంచి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల సాయం అందడమే కాకుండా ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. వివాహం వంటి శుభ కార్యక్రమాాల్లో పాల్గొంటారు. శివుడిని ఆరాధిస్తే అంతా మంచిదంటున్నారు జ్యోతిష పండితులు.

సింహరాశి Leo : ఇక ఈ రాశిలో పుట్టినవారు ఉద్యోగ, వ్యాపార, వృత్తిరంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా లబ్ది చేకూరుతుంది. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయడమే కాకుండా ఎప్పట్నించో అనుకుంటున్న కొత్త పనులను ప్రారంభిస్తారు. 

కన్యారాశి Virgo:  ఈ రాశివాళ్లు..ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. సమయానికి  అంటే కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవారు లభిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో అంటే వ్యాపార సంబంధ, ఆర్ధిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చుల్ని అదుపు చేసుకుంటే మంచిది.

తులారాశి Libra:  ఈ రాశిలో పుట్టినవారికి ఓ పనిలో ధనం చేతికి అందుతుంది. కుటుంబసభ్యులందరి సహకారంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. కొత్త కొత్త వస్తువులు లేదా ఇళ్లు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసుకుంటారు. శివుడిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనేది పండితులు చెబుతున్న మాట.

వృశ్చికరాశి Scorpio:  ఇక ఈ రాశిలో వారికైతే సంకల్పసిద్ధి ఉంటుంది. అంటే అనుకున్నది చేయగలరు.  ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడితే మంచిది. కొన్ని సంఘటనలు బాధ కలిగించినా..అంతా సమసిపోతుంది. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చికాకులు ఉండవు. ఆంజనేయుడిని దర్శించుకుంటే బాగుంటుంది.

ధనుస్సురాశి Sagittarius: చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

మకరరాశి Capricorn: ఇక ఈ రాశివారికి కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏ కారణం లేకుండా వివాదాల్లో చిక్కుకోగలరు. శారీరకంగా కష్టపడాల్సి వస్తుంది. కొందరి వ్యవహారశైలి మిమ్మల్ని బాధపెట్టవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులైతే అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. 

కుంభరాశి Aquarius: కుంభరాశిలో పుట్టినవారికి ఇతరుల సహకారం లభించడమే కాకుండా...శుభవార్త అందుతుంది. ఓ పనికి సంబంధించి సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలంగానే ఉన్నా..సూర్యుడిని ఆరాధిస్తే చాలా మంచిది.

మీనరాశి Pices:  ఈ రాశి వారికి ప్రారంభించిన పనిలో విజయం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. నిర్లక్ష్యాన్ని దూరం చేసుకుంటే చాలా మంచిది. ఇష్టదేవుడిని దర్శించుకోవడమే కాకుండా శని ధ్యానం చేస్తే మంచిదంటున్నారు పండితులు. 

Also read: కలల జ్యోతిషశాస్త్రం: పదే పదే మరణించిన వారు కలలో కనపడుతున్నారా..?? అయితే దానికి అర్థం ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News