/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Naga panchami 2022: శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతికరమైనది. ఈ మాసం అనేక పండుగలకు నెలవు. నాగ పంచమి, రక్షాబంధన్ వంటి ముఖ్యమైన పండుగలు ఈ నెలలోనే వస్తాయి. నాగ పంచమి (Naga panchami 2022) శ్రావణ మాసం శుక్లపక్షం ఐదో రోజున జరుపుకుంటారు.  రేపు అంటే 02 ఆగస్టు 2022 మంగళవారం నాడు నాగపంచమి. ఈ రోజున నాగదేవతను (Naga devatha) పూజిస్తారు. అంతేకాకుండా రేపు శ్రావణ మంగళవారం కూడా. ఇవాళ మంగళ గౌరీ వ్రతం పాటిస్తారు.  ఇన్ని యాదృచ్ఛికాలు ఒకేసారి రావడం చాలా అరుదైన విషయం. ఈ రోజున శివపార్వతులతోపాటు నాగదేవతను పూజించడం వల్ల భక్తులు కోరికలు నెరవేరుతాయి. 

నాగ పంచమి శుభ ముహూర్తం, పూజా విధానం
నాగ పంచమి పండుగ 2 ఆగస్ట్ 2022 న. ఈ రోజున పూజా కార్యక్రమాలు ఉదయం 6.05 గంటలకు ప్రారంభమై 8.41 వరకు కొనసాగుతాయి. ఈ ముహూర్తంలో చేసే పూజలు ఎక్కువ ఫలితాన్నిస్తాయి. నాగ పంచమి రోజున నాగదేవతను పూజిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. నాగపంచమి రోజు ఉదయాన్నే స్నానం చేసి...శుభ్రమైన బట్టలు ధరించాలి. తర్వాత నాగదేవత చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజలో పెట్టండి. తర్వాత అమ్మవారికి పసుపు, తిలకం పూయాలి. పువ్వులను సమర్పించాలి. అనంతరం దీపం వెలిగించి..ధూపం వేయండి. నాగ పంచమి రోజున నాగదేవతకు పచ్చి పాలు, పంచదార సమర్పిస్తారు.

Also Read: Diwali 2022: దీపావళి తర్వాత రోజే సూర్యగ్రహణం.. తేదీ, శుభ సమయం తెలుసుకోండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Section: 
English Title: 
Naga panchami on 02 August 2022: Shubh Muhurtam, puja vidhanam and Importance
News Source: 
Home Title: 

Naga Panchami 2022: రేపే నాగ పంచమి.. శుభ ముహర్తం, పూజా విధానం తెలుసుకోండి

Naga panchami 2022: రేపే నాగ పంచమి.. శుభ ముహర్తం, పూజా విధానం తెలుసుకోండి
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Naga Panchami 2022: రేపే నాగ పంచమి.. శుభ ముహర్తం, పూజా విధానం తెలుసుకోండి
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, August 1, 2022 - 16:18
Request Count: 
83
Is Breaking News: 
No