Swayambhu Movie: నిఖిల్ 'స్వయంభు'కు హీరోయిన్ దొరికేసింది.. ఎవరంటే?

Nikhil latest Movie: తెలుగు ఇండస్ట్రీలో విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్. ఇతడి ప్రస్తుతం చేస్తున్న సినిమా స్వయంభు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2023, 05:23 PM IST
Swayambhu Movie: నిఖిల్ 'స్వయంభు'కు హీరోయిన్ దొరికేసింది.. ఎవరంటే?

Swayambhu Movie update: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil) మరో పాన్ ఇండియాతో మూవీతో రాబోతున్నాడు. ఆయన లేటెస్ట్ సినిమా స్వయంభు (SWAYAMBHU). ఇప్పటికే నిఖిల్ బర్త్‌ డే సందర్భంగా స్వయంభు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయగా.. అది నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయింది. నిఖిల్ 20వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ఈ సినిమాలో  ఫీ మేల్ లీడ్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. విరూపాక్ష ఫేం సంయుక్తా మీనన్‌ ఇందులో హీరోయిన్ గా తీసుకుబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా నిఖిల్ కెరీర్ లోనే హైయ్యస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ లాంఛ్ ను ఆగస్టు 18న ఘనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి రెగ్యూలర్ షూటింగ్ మెుదలవుతుందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

నిఖిల్ 'స్పై' డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్ నిర్మిస్తున్నారు. స్వయంభు మూవీకి కేజీఎఫ్‌ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ తన మేకోవర్ ను పూర్తిగా ఛేంజ్ చేశాడట. ఈ చిత్రంలో నిఖిల్ యుద్ధవీరుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీకి  మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌ పనిచేస్తున్నారు. 

ఎన్నో అంచనాలతో వచ్చిన నిఖిల్ గత చిత్రం 'స్పై' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పాడు కూడా. ఈ యాక్షన్ మూవీని ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్ తెరకెక్కించాడు. ఇందులో ఐశ్వ‌ర్య మీన‌న్, స‌న్యా ఠాకూర్ హీరోయిన్లుగా న‌టించారు. రానా ద‌గ్గుబాటి (Rana Daggubati), ఆర్య‌న్ రాజేష్ అతిథి పాత్ర‌ల్లో మెరిశారు. 

Also Read: Guntur kaaram: మహేష్ కోసం రూ.4 కోట్లతో భారీ సెట్.. మూవీ నుంచి మరొకరు ఔట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News