Pitru Paksha 2022: పితృ పక్షంలో ఈ పొరపాటు చేయకండి.. మీరు భారీగా నష్టపోవచ్చు!

Pitru Paksha 2022: పితృ పక్షంలో చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం చేయకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2022, 12:09 PM IST
Pitru Paksha 2022: పితృ పక్షంలో ఈ పొరపాటు చేయకండి.. మీరు భారీగా నష్టపోవచ్చు!

Pitru Paksha 2022 Date: పితృ పక్షం మరో 5 రోజుల్లో ప్రారంభంకానుంది. అశ్వినీ మాసంలో కృష్ణ పక్షం ప్రతిపాదతో పితృ పక్షం (Pitru Paksha 2022) మెుదలవుతుంది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 10న ప్రారంభమై...సెప్టెంబర్ 25 వరకు కొనసాగనుంది. ఈ 15 రోజుల్లో పూర్వీకులు భూలోకానికి వస్తారని నమ్ముతారు. అంతేకాకుండా చనిపోయిన పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పూజలు, శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం చేస్తారు. లేకుంటే పూర్వీకులు కోపానికి గురై.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

పితృ పక్షం సమయంలో బ్రహ్మణులకు, పేదలకు దానం చేస్తారు మరియు ఆవులకు, కాకులకు ఆహారం పెడతారు. ఈ పితృ పక్ష సమయంలో మీరు తర్పణం, శ్రాద్ధం వంటివి చేయలేకపోతే సర్వపితృ అమావాస్య రోజు ఇవన్నీ చేయండి. మీ పూర్వీకులు సంతోషిస్తారు. మొదటి రోజు అంటే సెప్టెంబర్ 10వ తేదీన అగస్త్య ముని పేరుతో తర్పణం చేస్తారు. ఈ రోజున ఋషులకు నువ్వులు, పువ్వులు మరియు పండ్లు దానం  చేయాలి. ఒక వేళ మీ తల్లిదండ్రులు అమావాస్య నాడు మరణించి, ఈ 15 రోజులు శ్రాద్ధం చేయలేని వారు సెప్టెంబర్ 25 రోజు అంటే మహాలయ అమావాస్య తిథి నాడు శ్రాద్ధం మరియు తర్పణం చేయడం శుభప్రదం. 

పూర్వీకుల అసంతృప్తికి సంకేతాలు...
మీ పూర్వీకుల అసంతృప్తి లేదా పితృ దోషం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల కష్టాలు ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం ఉండదు. వ్యాపారంలో తరుచు నష్టాలు వస్తాయి. కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. దంపతులకు సంతానం కలగరు. కుటుంబంలో వివాహాలు జరుగవు. పూర్వీకులు పదే పదే కలలో కనిపిస్తారు. 

Also Read: Surya Gochar 2022: సూర్యుడి రాశి మార్పు... ఈ 3 రాశులకు టన్నుల కొద్ది అదృష్టం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News