Grah Gochar in 2022: రాబోయే 4 నెలలు ఈ రాశులవారికి లక్కే లక్కు... ఇక వీరికి తిరుగుండదు..

Grah Gochar in 2022: రాబోయే 4 నెలల్లో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. వీటి సంచారం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2022, 11:07 AM IST
Grah Gochar in 2022: రాబోయే 4 నెలలు ఈ రాశులవారికి లక్కే లక్కు... ఇక వీరికి తిరుగుండదు..

Grah Gochar in 2022: ఆస్ట్రాలజీలో ప్రతి గ్రహం యెుక్క కదలికలో మార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఏడాది ఇప్పటికే 8 నెలలకుపైగా గడిచిపోయాయి. మిగిలిన మూడున్నర నెలల కాలంలో ముఖ్యమైన గ్రహాలు (Grah Gochar in 2022) సంచరించనున్నాయి. ఈ కాలంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు కుజుడు వారి రాశులను మారుస్తారు. ఇదే సమయంలో శని గ్రహం మార్గంలో ఉంటుంది. ఈ గ్రహాల రాశి మార్పులు కొన్ని రాశులవారిపై శుభప్రభావాన్ని చూపుతాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

డిసెంబర్ 2022 వరకు 4 రాశుల వారికి శుభ సమయం
మిథునరాశి (Gemini)- మిథునరాశి వారికి సెప్టెంబరు నెలాఖరు నుండి డిసెంబరు చివరి వరకు చాలా బాగుంటుంది. పనిలో ప్రమోషన్ దక్కుతుంది. మీరు మీ రంగంలో రాణిస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio)- ఈ మూడున్నర నెలల కాలం వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు సూర్యుడు మరియు శుక్రుని సంచారం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించి ఎక్కువ లాభాలను ఆర్జించగలుగుతారు. విదేశాల నుండి లాభం ఉంటుంది. 

ధనుస్సు (Sagittarius)- శుక్ర మరియు సూర్యుని సంచారం ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరాశులవారు తమ కెరీర్ లో అనేక విజయాలు అందుకుంటారు. వ్యాపారంలో భారీ లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇల్లు, కారు కొనే అవకాశం ఉంది. 

మీనం (Pisces)- మీన రాశి వారికి కుజుడు, బుధుడు రాశి మారడం వల్ల లాభాలు కలుగుతాయి. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృత్తి మరియు వ్యాపారాలలో భారీగా లాభాలు ఉండవచ్చు. ఎక్కడైనా చిక్కుకున్న డబ్బు తిరిగివస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

Also Read: Shani Margi 2022: మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారికి ఊహించని ధనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News