Shani Margi 2022: మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారికి ఊహించని ధనం!

Shani Margi 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. వచ్చే నెలలో శనిదేవుడు తిరోగమనం నుండి మార్గంలోకి రానున్నాడు. ఇది కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2022, 09:34 AM IST
Shani Margi 2022: మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారికి ఊహించని ధనం!

Shani Margi 2022 In October: ఆస్ట్రాలజీ ప్రకారం, శని గ్రహం నెమ్మదిగా కదులుతుంది. రెండున్నరేళ్లకు ఒకసారి శనిదేవుడు తన రాశిని మారుస్తాడు. మనం చేసే మంచి, చెడు పనులను బట్టి శనిదేవుడు ఫలాలను ఇస్తాడు. అందుకే శనిదేవుడి కర్మదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. శని వక్రి (Shani Vakri) కారణంగా కొంతమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరు త్వరలోనే వాటి నుండి బయటపడనున్నారు. శనిగ్రహం అక్టోబరు 23న మకరరాశిలో తిరోగమనం నుంచి మార్గంలోకి (Shani Margi 2022) వస్తుంది. అయితే ఈ శని సంచారం కొన్ని రాశులవారు సమస్యల నుండి బయటపడి పురోగతి సాధిస్తారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం (Aries)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని సంచారం ఈ రాశి యెుక్క పదో ఇంట్లో జరగబోతుంది. దీంతో వ్యాపారులు భారీగా లాభాలను గడించనున్నారు. ఉద్యోగులకు అనేక రకాల జాబ్ ఆఫర్లు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. 

కర్కాటకం (Cancer)- శని ఈ రాశిలో సప్తమంలో సంచరించనున్నాడు. దీని వల్ల ఈ రాశుల వారి జీవితాల్లో దుఃఖాలు తొలగిపోయి సుఖాలు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ లైఫ్ పార్టనర్ నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది.  

తుల (Libra)- ఈ రాశి యెుక్క నాలుగో ఇంట్లో శని ఉండబోతున్నాడు. వీరి ఆదాయం పెరగనుంది. కొన్ని శుభవార్తలు వింటారు. తుల రాశి వారికి ఆర్థికంగా పురోగమించే అవకాశాలు ఉన్నాయి. 

వృశ్చికం (Scorpio)- మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే..ఇదే మంచి సమయం. మీరు పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది.  

మీనం (Pisces)- శని ఈ రాశివారి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాడు.  వీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీరు ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ విజయం సాధిస్తారు.

Also Read: Budhaditya Yog 2022: కన్యారాశిలో బుధాదిత్య యోగం... ఈ రాశులవారికి జాక్ పాట్ ఖాయం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News