Dough Kneading Vastu Tips: ఇలా పిండిని పిసికితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడం ఖాయం..

Vastu Tips for Dough Kneading: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నామంలో స్థానాలు బలహీనంగా ఉంది జీవితంలో అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. దీంతోపాటు ఆర్థికంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరకుండా ఉంటాయి. అయితే వీటన్నిటిని విముక్తి పొందడానికి ఈ రెమెడీస్ వినియోగించండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 11:00 AM IST
Dough Kneading Vastu Tips: ఇలా పిండిని పిసికితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడం ఖాయం..

Vastu Tips for Dough Kneading: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మరాశులు గ్రహాల స్థానాలు వ్యక్తిగత జీవితం పై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. జాతకం ప్రకారం పుట్టిన నెల గ్రహాల స్థానం బాగుంటే అదృష్టం ఎల్లప్పుడూ తోడుంటుంది. అంతేకాకుండా విజయాలకు ఆనందానికి కొదవ ఉండదు. అదే జన్మగ్రహాలు ప్రతికూల స్థానంలో ఉంటే జీవితం ఎప్పుడు సమస్యలతో ఉంటుంది. కష్టపడిన ఎలాంటి ఫలితాలు ఉండవు. కొంతమందికైతే భారీ మొత్తంలో ఆదాయం పొందినప్పటికీ సులభంగా ఖర్చవుతుంది. అంతేకాకుండా బంధాలు కూడా విచ్చిన్నమైపోతాయి. 

జన్మ నామంలో గ్రహాలు ప్రతికూల స్థానంలో ఉంటే పరిష్కారానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక నివారణ చర్యలు ఉన్నాయి. జాతకంలో గ్రహాలు చెడు స్థానంలో ఉన్నవారు ప్రతిరోజు పిండిని కలుపుతూ అందులోనే కొన్ని వస్తువులను మిక్స్ చేసి బాగా పిసకాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల దుష్ప్రభావాలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఆనందం పొందుతారు. అయితే ఎలాంటి నివారణలో పాటించడం వల్ల జాతకంలో గ్రహాల స్థితి మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహాల స్థితి మెరుగుపడడానికి చేయాల్సిన రెమెడీస్:
శాస్త్రం ప్రకారం సోమవారం రోజున ఏదైనా పిండిని పిసికే క్రమంలో అందులో నీటికి బదులు పాలను కలపాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆందోళన వాతావరణం తొలగిపోయి.. ప్రశాంతత కలుగుతుంది. దీంతోపాటు గ్రహాల స్థితి కూడా మెరుగు పడుతుంది.

మంగళవారం రోజున ఏదైనా పిండిని కలుపుతూ అందులో బెల్లం తురుముగాని, చెక్కరిని కలిపి రొట్టెల్లా తయారు చేయండి. ఇలా చేయడం వల్ల జాతకంలో అంగారకుడు బలపడతాడు అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి.

అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి బుధవారం రోజున పిండిని మెత్తగా నానబెట్టి కొత్తిమీరను కలిపి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకొని రొట్టెల్లా తయారు చేసుకొని తీసుకుంటే జీవితంలో ఎలాంటి దుష్ప్రభావాలు అయినా తొలగిపోతాయి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

గురువారం రోజున పిండిని పిసుకుతూ అందులో కొంత పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే శ్రీమహావిష్ణువుని అనుగ్రహం లభించి, జన్మ నామంలో బృహస్పతి బలపడతాడు దీని కారణంగా కష్టాలన్నీ తొలగిపోతాయి.

(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News