Rahu Transit 2023, Gemini, Virgo and Aquarius sign peoples will become rich: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంది. ఈ క్రమంలోనే రాహువు త్వరలోనే తన రాశిని మార్చనుంది. ఎప్పుడూ తిరోగమనం వైపు తిరిగే రాహు, కేతు గ్రహాలు ఏడాదిన్నరలో ఓసారి తమ రాశిని మార్చుకుంటాయి. 2022లో మేష రాశిలోకి ప్రవేశించిన రాహువు.. 2023లో మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ రాహు సంచారం అన్ని రాశుల వారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. 2023లో రాహువు సంచారం ముఖ్యంగా 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. ఈ మూడు రాశులు ఏవో ఓసారి తెలుసుకుందాం.
మిథునం:
రాహు సంచారం మిధున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మిధున రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు భారీ లాభాలను పొందనున్నారు. వ్యాపారం విస్తీర్ణం అయ్యే అవకాశం ఉంది. చాలా డబ్బు చేతికివస్తుంది. సంపదలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. భూమి, భవనాలు కొనుగోలు చేస్తారు.
కన్యా:
రాహువు రాశి మార్పు కన్యా రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. కన్యా రాశి వ్యక్తులు భాగస్వామ్య పనులలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్యంతో కొత్త పనిని ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అవివాహితులు వివాహం చేసుకోవచ్చు.
కుంభం:
మీన రాశిలోకి రాహువు ప్రవేశించడంతో కుంభ రాశి వారికి చాలా లాభాలు చేకూరుతాయి. కుంభ రాశి వ్యక్తులు అకస్మాత్తుగా చాలా డబ్బు పొందుతారు. ఊహించని ధన లాభం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. అధిక ప్రయోజనాలను పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. మధురంగా మాట్లాడి మీ పని పూర్తి చేసుకుంటారు. వ్యాపారులకు ఇది చాలా మంచి సమయం. ఆదాయం భారీగా పెరుగుతుంది.
Also Read: Telangana New Scheme: ఎన్నికలకు ముందే మరో పథకం.. 15 రోజుల్లోనే 3 లక్షలు!
Also Read: IND Playing XI vs BAN: శార్దూల్ ఔట్.. ఉమ్రాన్ ఇన్! బంగ్లాతో రెండో వన్డేలో ఆడే భారత తుది జట్టిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.