Rahu transit in Aries 2022: మేషరాశిలో రాహు సంచారం...ఈ తేదీ నుండి ఇండియాకు ఇబ్బందులు!

Rahu transit in aries: వరల్డ్... మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడి ఉంది. స్టాక్ మార్కెట్ మెుదలు బిలియన్ల మంది ప్రజల భద్రత ప్రమాదంలో పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ నెలలో జరగబోయే రాహు సంచారం భారతదేశంపై చెడు ప్రభావం చూపుతుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 12:12 PM IST
  • మార్చి 17న మేషరాశిలోకి రాహు ప్రవేశం
  • రాహు సంచారం ఇండియాపై ప్రభావం
  • సామాన్యుడికి తీవ్ర ఇబ్బందులు
Rahu transit in Aries 2022: మేషరాశిలో రాహు సంచారం...ఈ తేదీ నుండి ఇండియాకు ఇబ్బందులు!

Rahu transit in aries 2022: జ్యోతిష్యశాస్త్రంలో రాహువును చెడు గ్రహంగా పరిగణిస్తారు. మార్చి 17, 2022న రాహువు మేషరాశిలోకి (Rahu transit in aries 2022) ప్రవేశించబోతున్నాడు. 18 నెలల తర్వాత రాహువు రాశి మారడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెనుమార్పులు సంభవిస్తాయి. దీని ఎఫెక్ట్ కచ్చితంగా భారతదేశంపై (India) పడుతోంది. మార్చి 2022లో జరగబోయే ఈ రాహు సంచారం దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాన్య జీవితంపై కూడా ప్రభావం చూపునుంది. 

జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, రాహు, కేతు గ్రహాలు ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో కదులుతాయి. వారు 18 నెలల్లో రాశిచక్రాన్ని మారుస్తారు. మార్చి 17న, రాహువు (Rahu) వృషభరాశి నుండి బయలుదేరి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు, తదుపరి ఒకటిన్నర సంవత్సరాలు అక్కడే ఉంటాడు. రాహువు మేషరాశిలోకి ప్రవేశించే సమయంలో జాతకాన్ని విశ్లేషిస్తే, మకరరాశిలో శని, కుజుడు, శుక్రుడు అనే 3 గ్రహాలు ఏర్పడడం వల్ల యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీని ప్రభావం భారత్‌పై కూడా కనిపిస్తోంది.

ఆహార సంక్షోభం ఏర్పడుతోంది..
రాహువు మేషరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఆహారం, పానీయాల కొరత ఏర్పడుతోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ఉక్రెయిన్, రష్యాలు  ప్రపంచంలోనే గోధుమను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యద్ధరంగంలో ఉన్నాయి. దీంతో ధాన్యాల కొరత ఏర్పడి..ధరలు పెరుగుతాయి. ఫలితంగా అది ఆహారసంక్షోభానికి దారి తీస్తుంది.  అలాగే, రాహువు సంచారం వల్ల భారతదేశంలో అకాల వర్షాలు కురుస్తాయి, ఇది పొలాల్లో నిలిచిన పంటలకు పెద్ద నష్టం కలిగిస్తుంది.

స్టాక్ మార్కెట్‌పై ప్రభావం
ఏప్రిల్‌లో మేషరాశి నుండి పదకొండవ స్థానంలో ఉన్న కుంభరాశిలో శని-అంగారకుడు మరియు జూన్‌లో రాహువు-అంగారకుడు కలయిక స్టాక్ మార్కెట్‌లో (Stock Markets) చాలా హెచ్చు తగ్గులను తీసుకురావచ్చు. ఈ సమయంలో చాలా తెలివిగా పెట్టుబడి పెట్టాలి.

రాజకీయంగా గందరగోళం..
రాహువు సంచారం భారత రాజకీయాల్లో (Indian Politics) కూడా ప్రకంపనలు సృష్టించవచ్చు. ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య పెద్ద రాజకీయ తిరుగుబాటును తీసుకురావచ్చు. అంతే కాకుండా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. 

Also Read: Hindu God: హనుమాన్, వినాయకుడు, కృష్ణుడు, శంకరుడు.. దేశంలో ఏ దేవుడు ఫేమస్..??  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News