Raksha Bandhan Date And Time: శ్రావణ మాస పౌర్ణమి నిన్న అంటే ఆగస్టు 11వ తేదీ ఉదయం 10.37 గంటలకు ప్రారంభమై.. ఈరోజు అంటే ఆగస్టు 12, 2022 ఉదయం 07.06 వరకు కొనసాగుతుంది. నిన్నంతా భద్రకాలం ఉండటంతో చాలా మంది రక్షాబంధన్ (Raksha Bandhan 2022) జరుపుకోలేదు. వారంతా ఈ రోజు జరుపుకోవడానికి రెడీ అయ్యారు.
రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం
ఈరోజు రాఖీ కట్టాలనుకునే వారికి ఉదయం 07:06లోపు రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం. అయితే ఆ తర్వాత కూడా కొన్ని గంటల పాటు రాఖీ కట్టవచ్చు. అయితే ఈ రోజు పంచకం ఉంది. ఈ సమయంలో రాఖీ కట్టడం మంచిదికాదు. ఈరోజు పంచకం మధ్యాహ్నం 02:49 గంటలకు ప్రారంభమై... ఆగస్టు 16వ తేదీ మంగళవారం రాత్రి 09:07 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 12న రాఖీ కట్టేందుకు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 02:45 గంటల వరకు మంచి ముహూర్తం ఉంది. దీంతోపాటు నేటి నుంచే భాద్రపద మాసం ప్రారంభంకానుంది.
రాఖీ ఎలా కడతారు?
రక్షాబంధన్ రోజున సోదరి సోదరీమణులు ఉదయాన్నే స్నానం చేయాలి. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులను కూర్చోబెట్టి.. ఆపై వారికి తిలకం దిద్దుతారు. తర్వాత హారతి పడతారు. అనంతరం సోదరుడికి రాఖీ కట్టి.. స్వీట్స్ తినిపిస్తారు. అతడికి దీర్ఘాయుష్షు ప్రసాదించమని వేడుకుంటారు. తర్వాత సోదరులు సోదరీమణులకు బహమతులు ఇస్తారు. అంతేకాకుండా జీవితాంతం సోదరికి రక్షణగా ఉంటానని సోదరుడు ప్రమాణం చేస్తాడు. రాఖీ కట్టేటప్పుడు సోదరుడు లేదా సోదరి దక్షిణ దిక్కును చూడకూడదని గుర్తుంచుకోండి, ఇది యమ దిక్కు అంటే మృత్యువు. ఇలా చేయడం వల్ల జీవితకాలం తగ్గిపోతుంది.
Also Read: Rakhi Festival 2022: రాఖీ పండుగ నుండి 5 రాశులవారికి గోల్డెన్ డేస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook