Vijayadashami విజయదశమి నాడు సకల విజయాలను చేకూర్చే శమీ వృక్ష పూజ విశిష్టత తెలుసా?

Dussehra 2023 : దసరా రోజున జమ్మి చెట్టుకి చాలామంది పూజ చేస్తారు. మన పురాణాలో జమ్మి చెట్టుకి అదే శ‌మీ వృక్షానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పూజ చేస్తే ఎన్నో ఫలితాలు వస్తాయి అని మన పెద్దవారి నమ్మకం. అయితే ఇంతకీ ఈ శ‌మీ పూజ ఎందుకు చేస్తారు? అసలు దీని వెనుక కథ ఏమిటి ? ఇది చెయ్యడం వల్ల లాభమేమిటి అని ఎన్నో విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2023, 02:51 PM IST
Vijayadashami  విజయదశమి నాడు సకల విజయాలను చేకూర్చే శమీ వృక్ష పూజ విశిష్టత తెలుసా?

Sami Vruksham

అందరికీ విజయాలను చేకూర్చే విజయదశమి రోజున జమ్మి చెట్టుకి పూజ చేయడం అనాదిగా వస్తున్న మన ఆచారం. జమ్మి చెట్టుగా పిలవబడే శమీ వృక్షం మనకు ప్రతి దేవాలయంలో కనిపిస్తుంది. అయితే ఈ చెట్టుని పూజించడం వెనుక  కారణాలు చాలానే ఉన్నాయి. మన పురాణాల్లో కూడా కొత్త సందర్భాలలో ఈ జమ్మి చెట్టు గురించి ప్రస్తావించడం జరిగింది. ఇంతకీ జమ్మి చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

మన సంస్కృతిలో జమ్మి ప్రస్తావన రుగ్వేద కాలం నుంచి ఉంది. ఆనాడు అమృతం కోసం దేవదానములు కలిసి పాల సముద్రాన్ని మధించినప్పుడు అందులో నుంచి ఎన్నో దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అలా ఉద్భవించిన వాటిలో ఒకటే శ‌మీ వృక్షం. పూర్వం ఈ చెట్టుని యజ్ఞ యాగాదులకు అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే ఈ చెట్టుకి అర‌ణి అని మరొక పేరు ఉంది. మనం చేసే పనులు నిర్విఘ్నంగా పూర్తి కావడం కోసం శమీ వృక్షానికి పూజ చేయడం అనేది రాముడి కాలం నుంచే ఉంది.

త్రేతా యుగంలో లంకపై దండెత్తడానికి ముందు శ్రీరాముడు శమీ వృక్షానికి పూజ చేశాడు. అందుకే రావణుడు అంతటి రాక్షసుడి పై విజయాన్ని సాధించగలిగాడు. అలాగే మహాభారత కాలం లో, అజ్ఞాతవాస సమయంలో పాండవులు తమ ఆయుధాలను శమీ వృక్షంపై భద్రపరిచి వాటిని జాగ్రత్తగా కాపాడమని వృక్షాన్ని పూజ చేసి కోరారు. పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు తీసుకురావడానికి కపటంతో దుర్యోధనుడు సేన మస్యరాజ్యంపై ఆక్రమణ చేస్తుంది.

అప్పుడు శిఖండి వేషంలో ఉన్న అర్జునుడు అజ్ఞాతవాస కాల పరిసమాప్తి గుర్తుగా శమీ వృక్షానికి పూజ చేసి తన గాంధీ వారిని ధరించి యుద్ధానికి వెళతాడు. అలా యుద్ధంలో అర్జునుడు అజయుడుగా కౌరవులను ఓడిస్తాడు. ఇది విజయదశమి రోజే జరిగింది కాబట్టి.. అప్పటినుంచి అనాదిగా విజయదశమి రోజున శమీ వృక్షానికి పూజ చేయడం అనవాయతీగా మారింది.

శ‌మీ శ‌మ‌య‌తే పాపం శ‌మీ శ‌త్రు వినాశినీ
అర్జున‌స్య ధ‌నుర్ధారీ రామ‌స్య ప్రియ ద‌ర్శ‌నం

ఈ శ్లోకాన్ని చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తీసుకువెళ్లి ఇంటి బీరువాలో భద్రపరచుకుంటారు. జమ్మి చెట్టుకు పూజ చేయడం వల్ల జీవితంలో అనవసరమైన అడ్డంకులు తొలగి విజయాలు సాధిస్తామని నమ్ముతారు. రైతులు కూడా తమ పొలాలు పచ్చగా ఉండాలని పాడి పంటలు వర్ధిల్లాలని పశుసంపత్తి సురక్షితంగా ఉండాలని విజయదశమి నాడు జమ్మి వృక్షానికి పూజలు చేస్తారు. మరి మీరు కూడా ఈ విజయదశమి నాడు జమ్మి చెట్టుకి తప్పకుండా పూజ చేయండి.

Also read: Most Expensive Currency: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదో తెలుసా..! డాలర్ కంటే చాలా ఎక్కువ

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News