Saturn Retrograde In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడితో పాటు గ్రహానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహ సంచారానికి, తిరోగమనాని ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ శని గ్రహం రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి సంచారం చేస్తుంది. శని గ్రహం గత ఏడాది కుంభ రాశిలోకి ప్రవేశించింది. వచ్చే ఏడాది వరకు అదే రాశిలో కొనసాగుతూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు తిరోగమనం కూడా చేస్తుంది. నవంబర్ 15వ తేది వరకు ఈ శని గ్రహం తిరోగమనం చేయబోతోంది. ఆ తర్వాత ఈ గ్రహం రాశి సంచారం చేస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీవాళి వరకు శని తిరోగమనం కారణంగా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి:
కుంభరాశిలో శని తిరోగమనం చేయడం వల్ల సింహ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి మరో నాలుగు నెలల వరకు అనుకున్న పనులు జరుగుతాయి. వీరికి జీవితంలో సానుకూలత పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా పలు రకాల జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిది. దీంతో పాటుఉ వీరు కుంటుబ సభ్యులతో విహారయాత్రలకు కూడా వెళ్తారు. అలాగే వీరు కొన్ని శుభవార్తలు వినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
మేష రాశి:
వచ్చే 4 నెలల వరకు మేష రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు కొత్త జాబ్స్ పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే అనేక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ధనుస్సు రాశి:
ఈ తిరోగమనం కారణంగా ధనస్సు రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే 4 నెలల పాటు అనుకున్న పనులు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. శని ప్రత్యేకమైన అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ తొందరగా జరిగిపోతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు వీరు ఆర్థికపరమైన విషయాలపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి