Saturn Transit In Aquarius 2022: కుంభరాశిలో శని సంచారం.. ఈ 3 రాశుల వారికి లాభం..

Saturn Transit : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, శనిదేవుడు ఏప్రిల్ 29న కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. శని సంచారం కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 11:24 AM IST
  • జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది
  • పాత వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు
  • రోజువారీ ఆదాయం పెరుగుతుంది
Saturn Transit In Aquarius 2022: కుంభరాశిలో శని సంచారం.. ఈ 3 రాశుల వారికి లాభం..

Saturn Transit In Aquarius 2022: జ్యోతిష్యశాస్త్రంలో శనిగ్రహాన్ని ప్రభావవంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుడు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే..అతనికి శుభఫలితాలు ఇస్తాడు. చెడు పనుల చేస్తే శిక్షిస్తాడు. ఆయనను గ్రహాలలో న్యాయమూర్తి అని పిలవడానికి కారణం ఇదే. శనిదేవుడు ఏప్రిల్ 29న కుంభ రాశిలోకి (Saturn Transit In Aquarius 2022) ప్రవేశిస్తాడు. ఈ స్థానంలో శనిదేవుడు జూన్ 4 వరకు ఉంటాడు.  ఈ శని మార్పు వల్ల కొన్ని రాశుల వారి జీవితం అద్భుతంగా మారిపోతుంది.

కర్కాటక రాశి (Cancer): శనిదేవుడు కర్యాటక రాశిలో ఎనిమిదో ఇంట్లో ప్రవేశిస్తాడు. ఫలితంగా ఉద్యోగాలలో విజయం లభిస్తుంది. దీంతో పాటు రోజువారీ ఆదాయం పెరుగుతుంది. వీరు పాత వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తతలు ఉండవచ్చు. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల చదువు, పురోగతి గురించి అసంతృప్తి ఉంటుంది. శని దేవుడు మీకు కొన్ని సమస్యలను సృష్టిస్తాడు.

సింహం (Leo): శనిదేవుడు సింహ రాశిలో 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఏడో ఇల్లు అప్పులు, శత్రువులు మరియు వైవాహిక జీవితానికి కారకంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు శని దృష్టి కూడా లగ్న గృహంపై ఉంటుంది. దీని వల్ల తండ్రి బాధ పడవచ్చు. అలాగే తల్లి ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఇది కాకుండా, మానసిక ఆందోళన స్థితి అలాగే ఉంటుంది. గృహ, వాహన ఖర్చులు పెరుగుతాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. భాగస్వామ్య పనుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. వ్యాధి, ఋణం మరియు శత్రువు మానసిక ఆందోళన కలిగిస్తుంది.

 కన్య రాశి(Virgo): శని గ్రహం కన్యారాశిలోని 5వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఐదో ఇల్లు జ్ఞానం, పిల్లలు, మేధో సామర్థ్యానికి కారకం. ఇలా శని మారడం వల్ల పాదాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనితో పాటు కళ్లకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కాకుండా, ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Astrology Predictions: ఈ పేర్లు ఉన్నవారు చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News