Shani Amavasya 2023: శని అమావాస్య రోజున అరుదైన యాదృచ్ఛికం.. తేదీ, శుభ సమయం మరియు పూజా విధానం

Shani Amavasya 2023: వేద క్యాలెండర్ ప్రకారం, శని అమావాస్య జనవరి 21న వస్తుంది. ఈ అమావాస్య పూజా విధానం మరియు ప్రాముఖ్యత తెలుసుకోండి.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 09:04 AM IST
Shani Amavasya 2023: శని అమావాస్య రోజున అరుదైన యాదృచ్ఛికం.. తేదీ, శుభ సమయం మరియు పూజా విధానం

Shani Amavasya 2023 Shubh Muhurat: హిందువులకు అమావాస్య అంటే ఒక అపనమ్మకం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు ఏ పనిగానీ, శుభకార్యం గానీ చేయకూడదు అని అనుకుంటారు. ఈ సారి అమావాస్య జనవరి 21న వస్తుంది. పైగా ఆ రోజు శనివారం. అందుకే ఈ అమావాస్యను శనిశ్చరి అమావాస్య లేదా శని అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తారు. అంతేకాకుండా ఇదే రోజు 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన మకరరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా ఇదే రోజు అరుదైన నాలుగు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రోజుకు మరింత విశిష్టత పెరిగింది. శని అమావాస్య పూజా విధానం, శుభ యోగాలు గురించి తెలుసుకుందాం.

శని అమావాస్య శుభ సమయం మరియు తేదీ

వేద పంచాంగం ప్రకారం, ఈసారి అమావాస్య జనవరి 21 ఉదయం 6.16 గంటలకు ప్రారంభమై.. జనవరి 22 తెల్లవారుజామున 2.21 వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 21న అమావాస్య జరుపుకుంటారు. దీనితో పాటు శని దేవుడిని ఆరాధించే శుభ సమయం సాయంత్రం 6 నుండి 7.30 వరకు ఉంటుంది.

శని అమావాస్య రోజు అరుదైన యోగాలు

పంచాంగం ప్రకారం, ఈసారి ఖప్పర యోగం, చతుగ్రాహి యోగం, షడష్టక్ యోగం, సంసప్తక యోగాలు శనిశ్చరి అమావాస్య నాడు ఏర్పడుతున్నాయి. దీంతోపాటు శనిదేవుడు కుంభరాశిలో త్రికోణ స్థితిలో సంచరిస్తున్నాడు.

ఇలా పూజించండి

అమావాస్య రోజు సాయంత్రం శని దేవాలయానికి వెళ్లి శని విగ్రహం ముందు ఆవనూనె దీపం వెలిగించండి. దీనితో పాటు శని చాలీసా మరియు శనిదేవుని బీజ్ మంత్రాన్ని జపించాలి. అంతేకాకుండా అదే రోజు నల్ల దుప్పటి, నల్ల బూట్లు, నల్ల నువ్వులు, ఉరద్ పప్పును దానం చేయండి. శని సాడే సతి లేదా ధైయాతో బాధపడేవారు ఈరోజున రావిచెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించండి. అలాగే శని మహారాజుకు ఆవనూనెతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల శని దోషం నుండి విముక్తి పొందవచ్చు. ఈ రోజు మౌని అమావాస్య కూడా కాబట్టి ఉదయాన్నే గంగాస్నానం చేసి ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి పూర్వీకుల పేరుతో దానధర్మాలు చేయాలి.

Also Read: Gupt Navratri 2023: దుర్గామాత ఈ రాశుల వారిపై నోట్ల వర్షం కురిపించనుంది.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News