Shani Dev: శని నక్షత్ర సంచారం.. ఉన్నట్టుండి ఈ రాశుల వారికి విపరీతమైన డబ్బు, కోరికలు కూడా నెరవేరుతాయి!

Shani Grah Nakshatra Sanchar 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని గ్రహం సంచారం చేయడం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం త్వరలోనే పూర్వభద్రపదం నక్షత్రంలోకి సంచారం చేయబోతుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 26, 2024, 08:57 AM IST
Shani Dev: శని నక్షత్ర సంచారం.. ఉన్నట్టుండి ఈ రాశుల వారికి విపరీతమైన డబ్బు, కోరికలు కూడా నెరవేరుతాయి!

Shani Grah Nakshatra Sanchar 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క నిర్దిష్ట సమయంలో మాత్రమే రాశి నక్షత్ర సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేసినప్పుడు ఏర్పడే ప్రత్యేక ప్రభావం వ్యక్తుల జీవితాలపై కనిపిస్తుంది.. ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యమైన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయడం కారణంగా వ్యక్తిగత జీవితాల్లో శుభ అశుభ ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం హోలీ తర్వాత పూర్వ భాద్రపదం నక్షత్రం లోకి సంచారం చేయబోతోంది. ఈ నక్షత్రాన్ని బృహస్పతి గ్రహం పరిపాలిస్తుంది. అయితే ఈ శని గ్రహం పూర్వభద్రపాద నక్షత్రంలోకి సంచారం చేయడానికి ఎంతో కీలకంగా భావిస్తారు. ఈ నక్షత్ర సంచారం కారణంగా శని అధిపతిగా వ్యవహరించే కొన్ని గ్రహాలకు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే కోరుకున్న కోరికను కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహం నక్షత్ర సంచారం చేయడం కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

మకర రాశి:
శని గ్రహం నక్షత్ర సంచారం కారణంగా మకర రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశికి శని గ్రహం అధిపతిగా వ్యవహరిస్తుంది. అయితే ఈ సమయంలో నక్షత్ర సంచారం కారణంగా వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. దీంతోపాటు వీరికి సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ మాట తీరు పెరిగి అధికారులను ఆకట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు కొత్త కారు లేదా ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కోరికలు నెరవేరడానికి గొప్ప గొప్ప నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భాగస్వామ్య జీవితం కూడా మీరు అనుకున్నట్టుగానే కొనసాగుతుంది.

వృషభ రాశి:
శని నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారి కర్మ గృహంలో శని సంచారం చేయబోతోంది. కాబట్టి దీని కారణంగా ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలను పొందడమే కాకుండా.. ఇతర దేశాల్లో పెట్టుబడిలతో మరింత ఆదాయాన్ని పొందుతారు. ఈ సమయంలో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అలాగే తండ్రితో సంబంధం పెరిగి ఆస్తులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు లభిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఇక ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మేషం రాశి:
శని సంచారం కారణంగా మేష రాశి వారికి చాలా సువర్తనంగా ఉంటుంది. ఎందుకంటే వీరి జాతకంలో 11వ స్థానంలో ఈ సంసారం జరగబోతోంది. కాబట్టి ఈ సమయంలో వీరి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. డబ్బును ఆదా చేయడం కారణంగా ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి. దీంతోపాటు ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంటుంది ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం లాభదాయకమైన సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వర్తింపుల లాభాలు పొందుతారు. గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు కలుగబోతున్నాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News