Shani Dev Puja on Saturday: హిందూ శాస్త్రాల ప్రకారం.. శని దేవుడిని హనుమంతుడు రావణుడి చెర నుండి విడిపించాడు. మహా బలశాలి హనుమంతుడు లంక నుంచి సీతాదేవిని తీసుకొచ్చేందుకు వెళ్లిన క్రమంలో.. అక్కడ బంధీగా ఉన్న శని దేవుడిని కూడా విడిపించాలని వాయు దేవుడు కోరుతాడు. దీంతో శని దేవుడిని హనుమంతుడు విముక్తి చేస్తాడు. ఇందుకు కృతజ్ఞతగా హనుమంతుడిని ఏ వరం కావాలో కోరుకోమని శని దేవుడు అడుగుతాడు.
అందుకు హనుమంతుడు తనకే వరం అక్కర్లేదని.. సీతారాములు త్వరగా కలిస్తే అదే తనకు పెద్ద సంతోషమని చెబుతాడు.హనుమంతుడి మాటలకు సంతోషించి శని దేవుడు ఇలా చెబుతాడు. ఇకపై ఎవరు హనుమంతుడిని ప్రార్థించినా.. వారు శని దోషం నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.అంటే హనుమాన్ భక్తుల వైపు శని కన్నెత్తి కూడా చూడడు. అందుకే శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శని ప్రభావం లేకుండా చూసుకోవచ్చు.
శివుడు- శని దేవుడు శివ భక్తుల వైపు కూడా కన్నెత్తి చూడడు.పురాణాల ప్రకారం సూర్య భగవానుడి ఆదేశాలతో శివుడు తన గణాలతో శని దేవుడిపై యుద్ధం చేస్తాడు. శివుడి గణాలను శని దేవుడు ఓడిస్తాడు. ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి శనిని భస్మం చేస్తాడు. శని దేవుడిని శివుడు 19 ఏళ్ల పాటు రావిచెట్టుకు తలకిందులుగా వేలాడదీసి శిక్షించినట్లు చెబుతారు. అందుకే శివ భక్తుల వైపు శని దేవుడు కన్నెత్తి చూడడు.
రావిచెట్టు : శివుడు శని దేవుడిని రావిచెట్టుకు వేలాడదీసి శిక్షించినందునా శనికి రావిచెట్టు అంటే భయం. శనివారం నాడు ఎవరైతే రావిచెట్టుకు పూజలు చేస్తారో శని దేవుడు వారి వైపు కన్నెత్తి చూడడు.
చిత్రరథ అంటే భయం- పురాణాల ప్రకారం, శని దేవ్ చిత్రరథ్‌ని వివాహం చేసుకున్నాడు. ఒకరోజు చిత్రరథుడు ఆడపిల్లను పొందాలనే కోరికతో శని దేవుడిని చేరుకున్నాడు. అప్పుడు శని దేవుడు శ్రీకృష్ణుడి ఆరాధనలో మునిగిపోయాడు. చాలా సేపు వేచి చూసి విసిగిపోయాక చిత్రరథ శని దేవుడిని తిట్టిందని చెబుతారు. అప్పటి నుంచి శని దేవుడికి తన భార్య చిత్రరథంటే భయం. అందుకే చిత్రరథను పూజించవారి వైపు కూడా శని కన్నెత్తి చూడడు.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Rajamouli : నా స్వార్ధం అదే.. అసలు విషయం బయట పెట్టిన రాజమౌళి
Also Read: Rashi Khanna Pics: హద్దులు దాటేసిన రాశీ ఖన్నా.. దాచడానికి ఇంకేముంది?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook