Vakri Shani 2023: ఈ 3 రాశుల జీవితాన్ని అల్లకల్లోలం చేయనున్న శని.. మీది ఉందా?

Vakri Shani 2023: శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక డిసెంబరు వరకు మూడు రాశులవారికి సమస్యలను సృష్టించనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2023, 04:28 PM IST
Vakri Shani 2023: ఈ 3 రాశుల జీవితాన్ని అల్లకల్లోలం చేయనున్న శని.. మీది ఉందా?

Shani Vakri 2023 Effect: గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలేది శని. ప్రతి మనిషి యెుక్క మంచి మరియు చెడు పనుల ఆధారంగా శనిదేవుడు ఫలాలను ఇస్తాడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని గ్రహం ఒక రాశి నుండి మరోక రాశిలోకి వెళ్లడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శనిగ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమనంలో ఉంది. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. ఇతడి వక్ర దృష్టి పడిందంటే ధనవంతుడు కూడాదరిద్రుడిగా మారతాడు. శని తిరోగమన సమయంలో డిసెంబరు నెల వరకు కొన్ని రాశుల వరరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహరాశి 
శని రివర్స్ కదలిక వల్ల సింహరాశి వారు ఎంత కష్టపడినప్పటికి తగిన ఫలితాలను పొందలేరు. కొత్త ఉద్యోగానికి సంబంధించి మనస్సులో కలవరం ఏర్పడుతుంది. మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. వ్యాపారంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో శని గ్రహం యెుక్క చెడు ప్రభావాలను నివారించాలంటే శివుడిని స్తుతించాలి. ఇలా చేయడం వల్ల మీరు శుభఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
శని తిరోగమనం వల్ల వృశ్చిక రాశి వారు డిసెంబరు వరకు ఇబ్బందులను ఎదుర్కోంటారు. మీ కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. అజాగ్రత్త వల్ల మీరు సమస్యలను ఎదుర్కోంటారు. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో డబ్బు మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శని యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి మంగళవారం హనుమంతుడిని పూజించండి. మీరు ప్రతి శనివారం శివపార్వతులను పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
మీనరాశి 
మీన రాశి వారికి శని సడే సతి మొదటి దశ కొనసాగుతోంది. దీని కారణంగా మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోంటారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. మీరు ఆరోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. మీరు శారీరకంగా ఇబ్బందులను  ఎదుర్కోవల్సి రావచ్చు. మిమ్మల్ని ఏదైనా సమస్య చుట్టుముట్టే అవకాశం ఉంది. శని యొక్క శుభ ఫలితాల కోసం బాధితులకు సహాయం చేయండి. దీనితో పాటు, ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ ఆలయంలో పూజలు చేయండి. 

Also Read: Shubh Yog: జాతకంలో ఈ యోగం ఉంటే.. మీరు కింగ్ లా బతుకుతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News