Shukra Gochar: శుక్ర గ్రహ సంచారంతో భారీగా లాభాలు పొందబోతున్న రాశుల వారు వీరే.. ఇకనుంచి ఏం చేసినా మీకు భారీ లాభాలే!

Shukra Gochar 2023 April: శుక్ర గ్రహం ఇదే నెలలో తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో గ్రహ సంచార ప్రభావం పలు రాశుల వారిపై పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పదనుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2023, 07:15 PM IST
Shukra Gochar: శుక్ర గ్రహ సంచారంతో భారీగా లాభాలు పొందబోతున్న రాశుల వారు వీరే.. ఇకనుంచి ఏం చేసినా మీకు భారీ లాభాలే!

Shukra Gochar 2023 April: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని అందం, విలాసవంతం, ప్రేమకు కారకంగా పరిగణిస్తారు. శుక్ర గ్రహం జాతకాల్లో అనుకూలంగా ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అదే శుక్రుడు బలహీనంగా ఉంటే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. వృషభ, తులా రాశి లకు అధిపతిగా వ్యవహరించే శుక్ర గ్రహం ఏప్రిల్ 6 తేదీన వృషభ రాశిలోకి సంచరించబోతోంది. అయితే ఈ క్రమంలో అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు చేర్పులు ఏర్పడబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశుల వారు ప్రయోజనాలు పొందితే మరికొన్ని రాశుల వారు తీవ్ర నష్టాలకు గురవచ్చు. ఈ గ్రహ సంచారం ప్రభావంతో ఏయే రాశుల వారు ఎలాంటి మార్పుల చేర్పుల గురవుతారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశుల వారి జీవితాల్లో మార్పులు తప్పనిసరి:
మేష రాశి:

మేష రాశి వారు ఈ క్రమంలో ప్రయాణాలు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆఫీసులలో పనిచేసే వారికి ప్రమోషన్స్ తో పాటు ఇంక్రిమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములు అయితే ఈ క్రమంలో భారీ లాభాలు కూడా పొందవచ్చు. అయితే ఆర్థిక విషయాల పట్ల ఈ రాశి సంచారం కారణంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి వ్యాపార రంగంలోనైనా పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ క్రమంలో పలు అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. 

వృషభ రాశి:
శుక్ర గ్రహ సంచారం వల్ల వృషభ రాశి వారికి మీరు పనిచేస్తున్న కార్యాలయాల్లో మంచి గౌరవం దక్కుతుంది. కాకుండా మీ సీనియర్లు మీపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఈ కారణంగా మీకు ప్రమోషన్ కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కష్టపడి పని చేస్తే భారీ లాభాలు పొందుతారు. ఇంతకుముందు ఏవైనా అప్పులు ఉంటే సులభంగా చెల్లిస్తారు. అప్పు చెల్లించే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. జర్నీ చేసే సమయంలో తొందరపడి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. కాబట్టి ఇలా చేయకపోవడం చాలా మంచిది.

కన్య రాశి:
కన్యా రాశి వారు కూడా శుక్ర సంచారం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీరు కార్యాలయాల్లో ప్రమోషన్స్ రూపంలో లేదా ఇంక్రిమెంట్స్ రూపంలో శుభవార్తలు వింటారు. అంతేకాకుండా మీపై సీనియర్ అధికారుల దృష్టి కూడా పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో కష్టపడి పని చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నవారు ఈ క్రమంలో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు శుక్ర గ్రహ సంచారం వల్ల విపరీతమైన లాభాలు పొందుతారు. 

మకర రాశి:
చాలా కాలం పాటు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారు శుక్ర గ్రహ సంచారం వల్ల సులభంగా వీరు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి కోరికలు కోరుకున్న సులభంగా నెరవేరుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులైతే ఎలాంటి పోటీ పరీక్షలు రాసిన మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారు ఆర్థిక విషయాల పట్ల తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర నష్టాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News