Shukra Gochar 2023: 23 రోజులు పాటు ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే, ఇక డబ్బే..డబ్బు..

Shukra Gochar 2023: శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల చాలా రాశులవారికి భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 6, 2023, 09:44 AM IST
Shukra Gochar 2023: 23 రోజులు పాటు ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే, ఇక డబ్బే..డబ్బు..

Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ప్రత్యేక ప్రముఖ్య ఉంది. అయితే గ్రహాలు రాశి సంచారం చేసిప్పుడు కొన్ని రాశులవారికిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులవారు శుభ ఫలితాలు పొందితే.. మరికొంత మంది మాత్రం తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆగస్టు 7వ తేదీన ఆనందం, శోభ, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. అయితే శుక్రుడు ఆ రాశిలోనే దాదాపు 23 రోజులు ఉండబోతున్నాడు. దీని కారణంగా శుక్రుడి ప్రభావం కొన్ని రాశులవారిపై పడుతుంది. దీని కారణంగా ఆ రాశులవారు ఊహించని లాభాలతో పాటు ఆనంద జీవితాన్ని గడపబోతున్నారు.

ఈ రాశులవారిపై ప్రభావం:
వృషభ రాశి:

వృషభ రాశి వారికి కర్కాటక రాశిలో శుక్ర గ్రహం సంచారం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శారీరక సుఖాలు పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో విలాసాలవంతమైన జీవితం గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ప్రేమ జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఇక వృత్తి జీవితాన్ని గడుపుతున్నవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. 

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

సింహ రాశి:
శుక్రుడు రాశి సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బ్యాంకు బ్యాలెన్స్‌ ఆకస్మికంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతక ముందు నష్టపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తులు తిరిగి వస్తాయి. వైవాహిక జీవితంలో కూడా ఆనందం కూడా పెరుగుతుంది. భవిష్యత్‌లో మంచి లాభాలు కలగడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

కర్కాటక రాశి:
శుక్రుడి సంచారం కారణంగా కర్కాటక రాశివారికి కూడా చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరికి గౌరవం, విశ్వాసం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా రకాల లాభాలు పొందుతారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News