Solar Eclipse 2022: సూర్య గ్రహణం తరువాత తప్పకుండా చేయాల్సిన 3 పనులివే.. ఇక మీదే మంచికాలం!

What To Do After Solar Eclipse: సూర్య గ్రహణం తరువాత ఏమేమి పనులు చేయాలి, ఏమేమి చేయాలి అనే వివరాలు మీకోసం 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 25, 2022, 07:56 PM IST
Solar Eclipse 2022: సూర్య గ్రహణం తరువాత తప్పకుండా చేయాల్సిన 3 పనులివే.. ఇక మీదే మంచికాలం!

Solar Eclipse 2022 : What To Do After Solar Eclipse: ఈరోజు భారతదేశంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. మండదగ్గర సూర్యగ్రహణం సాయంత్రం 04.32 నుండి ప్రారంభమవగా అది 06.32 గంటల వరకు ఉంటుంది. అయితే గ్రహణం కంటే ముందే ఈ గ్రహణ సూతకం ఉదయం 4:10 నుంచి ప్రారంభమైంది. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ సూర్యగ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

తులారాశిలో సూర్యగ్రహణం ఏర్పడబోతోందని, సూర్యుడితో పాటు శుక్రుడు, కేతువు, చంద్రుడు కూడా తులారాశిలో ఉంటారని జ్యోతిష్య నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. దీనితో పాటు, బుధుడు, శని, శుక్రుడు మరియు బృహస్పతి గ్రహాలు కూడా వారి వారి రాశిచక్ర గుర్తులలో ఉంటాయని వారు చెబుతున్నారు.. ఈ క్రమంలోనే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యగ్రహణం తర్వాత, కొన్ని విషయాలను చేయకూడదు, కొన్ని విషయాలను తప్పనిసరిగా చేయాలి. ఈ క్రమంలో సూర్యగ్రహణం తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం పదండి. 
 
గ్రహణ సమయంలో  స్పర్శ స్నానం చేయకూడదు, అలాగే జపం చేయకూడదు, యజ్ఞయాగాలు చేసి బలి ఇవ్వకూడదు, అలాగే  దేవతలకు కూడా బలి ఇవ్వకూడదు. అయితే సూర్యగ్రహణం ప్రారంభం కాగానే మానసిక జపం, హోమం, దైవారాధన, మంత్రోచ్ఛారణ, గ్రహణ మోక్షకాలంలో దానధర్మాలు చేయాలి అలాగే గ్రహణం ముగిశాక స్నానం చేయాలి.  
 
What Not To Do After Solar Eclipse:  సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు?
అలాగే సూర్యగ్రహణం సమయంలో సూర్యభగవానుని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్యాష్టకం స్తోత్రం మొదలైన సూర్య స్తోత్రం పఠించాలి. అలాగే, గ్రహణ కాలంలో వండిన ఆహారం, కోసిన కూరగాయలు కలుషితమవుతాయి కాబట్టి వాటిని య్యి, నూనె, పాలు, పెరుగు, లస్సీ, వెన్న, చీజ్, ఊరగాయ, చట్నీ మొదలైన వాటితో కలిపి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గ్రహణంలో కలుషితం కాకుండా ఉంటారు.

ఇక గ్రహణ సమయంలో పూజలు చేయడం నిషిద్ధమే అయినా మంత్రాలను పఠించడం ద్వారా గ్రహణ ప్రభావం తగ్గుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇక ఈ గ్రహణ సమయంలో దేవుని విగ్రహాన్ని తాకడం కూడా నిషిద్ధమని, అందుకే గ్రహణానికి ముందు మరియు గ్రహణం ముగిసే వరకు సూతకాలలో, దేవాలయాల తలుపులు మరియు ఇంటిలో మందిరం తలుపులు మూసివేయబడతాయని పెద్దలు చెబుతారు. 

సూర్యగ్రహణం తర్వాత ఏమి చేయాలి?
సూర్యగ్రహణం ముగిసిన తరువాత ఇల్లు, దుకాణం, అలాగే వ్యాపార సంస్థలను శుభ్రం చేసి ప్రతిచోటా శుద్ధి జలం చల్లి శుద్ధి చేయాలి.  మరీ ముఖ్యంగా ఇంటిని అయితే ఉప్పునీటితో కడగాలి. ఆ తర్వాత, స్వయంగా స్నానం చేసి, ఇంట్లో దేవతా విగ్రహాలను, పటాలను శుభ్రం చేయాలి. అంతేకాక సూర్యగ్రహణం తర్వాత దానం చేయడం చాలా పుణ్యం అని చెబుతారు.

గోధుమలు, శనగలు, రాగి పాత్ర, ఎర్రటి వస్త్రం, బంగారం, ఉప్పు, బెల్లం, పత్తి మొదలైన వాటిని దానం  చేస్తే మంచిదని చెబుతారు. ఇక సూర్యగ్రహణం తర్వాత ఆహార పదార్థాలపై గంగాజలాన్ని చల్లి శుద్ధి చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలని కూడా పెద్దలు చెబుతారు. .

సూర్య గ్రహణం తర్వాత పాటించవాల్సిన మంత్రాలు ఇవే:

Also Read: Solar Eclipse 2022: కొన్ని గంటల్లో సూర్యగ్రహణం.. ఈ రాశులవారిపై డబ్బు వర్షం...

Also Read: Solar Eclipse 2022: సూర్యగ్రహణం నేరుగా చూస్తున్నారా? అది యమా డేంజర్ గురూ.. ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News