Surya Gochar 2023: మూడు దశాబ్ధాల తర్వాత కుంభంలో తండ్రీ కొడుకుల కలయిక.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..

Shani Surya yuti 2023: కుంభరాశిలో శని, సూర్యుడి కూటమి ఏర్పడబోతోంది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 01:39 PM IST
Surya Gochar 2023: మూడు దశాబ్ధాల తర్వాత కుంభంలో తండ్రీ కొడుకుల కలయిక.. ఈ రాశులకు తిరుగులేదు ఇక..

Conjunction Of Shani And Sun:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఇతర గ్రహాలతో సంయోగం చేస్తాయి. మరో వారం రోజుల్లో అంటే ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే శనిదేవుడు అదే రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కుంభంలో శని, సూర్యల కలయిక ఏర్పడుతుంది. వీటి సంయోగం కొన్ని రాశుల అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం. 

సింహ రాశి
శని మరియు సూర్యుని కలయిక సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారంలో మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 

మిథునం
శని మరియు సూర్యుని కలయిక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 

ధనుస్సు రాశిచక్రం
శని మరియు సూర్యుని కలయిక ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో మూడవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారు మంచి లాభాలను  గడిస్తారు. మీరు ఆర్థికంగా మునుపటి కంటే బలపడతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.

Also Read: Astrology: ఛాయా గ్రహం గమనంలో పెను మార్పు.. ఈ 4 రాశుల ఇళ్లు నోట్ల కట్టలతో నిండటం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News