Sun and Venus Conjunction: ఆగస్టు నెలలో సూర్యుడి రాశి పరివర్తనం ఉంది. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా 4 రాశులపై శుభ ప్రభావం పడనుంది. మరోవైపు సూర్య, శుక్ర గ్రహాల కలయిక అంతులేని లాభం చేకూర్చనుంది.
సూర్యుడంటే విజయాన్ని అందించే గ్రహంగా భావిస్తారు. అటు శుక్రుడిని ధనం, భౌతిక సుఖం, రోమాన్స్, ప్రేమ సంబంధిత వ్యవహారాలకు కారకమైన గ్రహంగా చెబుతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య, శుక్ర గ్రహాలు రెండూ ఈ నెల సూర్యుడి రాశి సింహంలో కలవనున్నాయి. సింహరాశిలో శుక్ర, సూర్య గ్రహాల కలయికతో 12 రాశులపై ప్రభావం పడనుంది. ఆగస్చు 17న సూర్యుడి సింహరాశిలో ప్రవేశించనున్నాడు. ఆగస్టు 31న శుక్రుడు కూడా సింహరాశిలో ప్రవేశిస్తాడు. సూర్య, శుక్ర గ్రహాల కలయికతో 4 రాశుల జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆగస్టు 31న ఈ కలయిక జరుగుతుంది. సెప్టెంబర్ 15 వరకూ కొనసాగుతుంది. అంటే దాదాపు 25 రోజుల తరువాత ఈ నాలుగు రాశుల జీవితం పూర్తిగా మారిపోనుంది.
వృషభ రాశివారికి సూర్య, శుక్ర గ్రహాల కలయిక అద్భుతమైన లాభాన్ని అందించనుంది. వీరి జీవితంలో అన్నీ విజయాలే లభించనున్నాయి. సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. అనుకున్న ప్రత్యేక పని విజయవంతమై..ఆనందంతో ఉంటారు. ఉన్నత చదువులకై కోరిన చోట అడ్మిషన్ లభిస్తుంది.
మిధునరాశి వారికి కుటుంబ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. విజయం లభిస్తుంది. అంతులేని ధనం వచ్చి పడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
కర్కాటక రాశివారికి ఊహించని ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగం చేసేవారికి జీతాలు పెరిగితే..వ్యాపారస్థులు లాభాలు ఆర్జిస్తారు. విభిన్న మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలుంటాయి. మీరు వెళ్లిన ప్రతిచోటా అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. పనులన్నీ సులభంగా పూర్తవుతాయి.
కుంభరాశివారికి సూర్య శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఊహించని మార్పులు, ప్రయోజనాలు చేకూరుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరిగి..ప్రేమ ఉప్పొంగుతుంది. పార్టనర్‌షిప్ వ్యాపారంలో కూడా లాభాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనువైన సమయం. ఆర్ధికంగా బాగుంటుంది.
Also read: Angarak Yog: అంగారక యోగం వల్ల.. ఆగస్టు 10 దాకా ఈ రాశి వారికి కష్టాలు తప్పవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook