Sun Transit November 2023: గ్రహాలకు రాజుగా పిలిచే సూర్యగ్రహం ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంది. ఈ గ్రహం 12 రాశుల్లోకి సంచారం చేయడానికి మొత్తం ఒక సంవత్సరం పాటు సమయం పడుతుంది. అన్ని రాశుల్లో సూర్యుడు కేవలం ఒక నెల మాత్రమే ఉంటుంది. దాదాపు 365 రోజుల తర్వాత సూర్యుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం నవంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 01:18 గంటలకు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత సూర్యుడు నవంబర్ 20న అనూరాధ నక్షత్రంలో, డిసెంబర్ 03న జ్యేష్ఠ నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సూర్యగ్రహం సంచారం ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సింహ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..సూర్యగ్రహాన్ని సింహ రాశి పాలిస్తుంది. కాబట్టి ఈ గ్రహం రాశి సంచారం చేయడం వల్ల సింహ రాశివారి జీవితాల్లో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇంతకముందు నిలిపోయిన పనులు కూడా సులభంగా జరుగుతాయి.
Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!
కన్యారాశి:
కన్యా రాశి వారికి సూర్యుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కన్యారాశివారికి వైవాహిక జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇంతకముందు ఉన్న సంతోషం కంటే రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ప్రేమ జీవితంలో కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
తుల రాశి:
ఈ సంచారం కారణంగా తుల రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి సహోద్యోగుల నుంచి పూర్తి మద్ధతు లభించి ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook