Sun Transit 2023: మరో 5 రోజుల్లో ఏర్పడనున్న 'బుధాదిత్య రాజయోగం' ఈ 3 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయం!

Budhaditya Rajayogam 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా రాశి పరివర్తనం చెందుతుంటాడు. గ్రహాల గోచారానికి ప్రాధాన్యత ఉన్నట్టే సూర్య గోచారానికి ఊహించిన మహత్యముంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2023, 11:13 AM IST
Sun Transit 2023: మరో 5 రోజుల్లో ఏర్పడనున్న 'బుధాదిత్య రాజయోగం' ఈ 3 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయం!

Sun Transit in Aries on 14th April 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి చాలా మహత్యముంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో గోచారం చేస్తుంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. సూర్యుడి గోచారం ప్రభావంతో మరో 5 రోజుల్లో ఆ మూడు రాశుల జాతకులు సంపదలతో తులతూగనున్నారు. 

సూర్యుడు మేషరాశిలో ఏప్రిల్ 14వ తేదీన ప్రవేశించనున్నాడు. అప్పటికే మేషరాశిలో బుధుడు ఉండటం వల్ల సూర్యుడి మేషరాశి గోచారం బుధాదిత్య యోగాన్ని ఏర్పర్చనుంది. దాంతో బుధాదిత్య రాజయోగం 3 రాశులకు అత్యంత శుభసూచకంగా మారనుంది. మరో 5 రోజుల్లో మూడు రాశులకు పండగే పండగ. ప్రస్తుతం సూర్యుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14న బుధుడు ఆశీనుడై ఉన్న మేషరాశిలో గోచారం చేయడంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం బుధాదిత్య రాజయోగానికి కీలక ప్రాధాన్యత ఉంది. ఫలితంగా 12 రాశులపై వివిధరకాలుగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 3 రాశులకు మాత్రం మహర్దశ పట్టనుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 14 నుంచి ఏ రాశుల అదృష్టం మారనుందో తెలుసుకుందాం..

కర్కాటక రాశి:

సూర్యుడి మేష రాశి ప్రవేశం కారణంగా ఏర్పనున్న బుధాదిత్య రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈ జాతకం వారి కెరీర్ ఉన్నతస్థితికి చేరుకుంటుంది. ఉద్యోగులు కోరుకున్నచోటికి బదిలీ అవుతారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. పాత వివాదాలను లేదా కోర్టు కచేరీలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయం అదృష్టం తిరగరాస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధికంగా ఏ విధమైన సమస్యలు తలెత్తవు.

Also Read: Chandra Grahan 2023: మే 5న తొలి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..!

మేష రాశి:

సూర్యుడు ఏప్రిల్ 14న మేషరాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే ఈ రాశిలో ఉన్న బుధుడి కారణంగా ఏర్పడే బుధాదిత్య యోగంతో మేషరాశి జాతకులు జీవితంలో ఊహించని అదృష్టాన్ని చవిచూస్తారు. సంపద వచ్చి పడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా దూరమౌతాయి. ఉద్యోగమార్పు కోరుకుంటే అది కూడా సాధ్యమౌతుంది. ఈ జాతకం వారి ఆదాయం పెరుగుతుంది. 

సింహ రాశి:

సూర్య, బుధ గ్రహాలు ఒకే రాశిలో అంటే మేషరాశిలో కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ 14 నుంచి ఈ రాజయోగం ప్రభావం సింహరాశిపై అద్భుతంగా ఉండనుంది. ఈ రాశివారికి అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. సూర్య గోచారం సింహరాశి జాతకుల జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. జీతభత్యాలు కూడా పెరుగుతాయి.

Also Read: Shani Gochar 2023: శని దశమ దృష్టి ప్రభావం, ఆ 3 రాశులకు ఊహించని అదృష్టం, ఇవాళ్టి నుంచి అంతా డబ్బే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News